• facebook
  • whatsapp
  • telegram

Large..Vast..High

Sumanth: The college occupies a large area of nearly a hundred acres.

(ఆ కళాశాల 100 ఎకరాల వైశాల్యం ఉన్న పెద్ద స్థలాన్ని ఆవరించి ఉంది.)

Shankar: Very few colleges, especially in a populous city like ours, have such a vast campus.

(మన నగరంలాంటి జనసమ్మర్థం ఉండే నగరాల్లో చాలా కొద్ది కళాశాలలకు మాత్రమే ఇంత ఆవరణ ఉంది.)

Sumanth: What do you think is our city's population?

(మన నగర జనాభా ఎంత ఉంటుందనుకుంటున్నావు?)

Shankar: I don't know exactly, but I am sure of one thing- for a city its size the population is on the high side.

(కచ్చితంగా నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. ఈ నగర పరిమాణానికి దీని జనాభా మాత్రం ఎక్కువే)

Sumanth: I don't know the actual count either, but I am sure it is rather vast.

(నాక్కూడా కచ్చితంగా ఇంత అని తెలియదు. కానీ చాలా ఎక్కువ అని మాత్రం తెలుసు.)

Shankar: That the college has such a campus, and such spacious buildings in a crowded city like this is really surprising.

(ఇలాంటి జనసమ్మర్థం ఉన్న నగరంలో ఇంత సువిశాలమైన కట్టడం ఉండటం ఆశ్చర్యమే.)

Sumanth: No surprise at all. This was built before the city has expanded all around. Just 15 years ago, the college stood alone here, with immense open spaces around.

(ఆశ్చర్యమేమీ లేదు. అన్ని వైపులా నగరం విస్తరించక ముందే ఈ కళాశాలను కట్టారు. 15 ఏళ్ల కిందటి వరకు, ఇక్కడ ఈ కళాశాల ఒకటే ఉండేది, చుట్టూ పెద్ద ఖాళీ స్థలాలుండేవి)

Shankar: The college is very well provided for. It has substantial reserve funds too. In addition, it charges hefty fee, but offers generous scholarships too.

(ఆ కళాశాల అవసరాలకు తగినన్ని ఆర్థిక వనరులున్నాయి. దానికి నిల్వ నిధులు కూడా భాగానే ఉన్నాయి. అదనంగా అది అధిక ఫీజులను వసూలు చేస్తుంది. కానీ ఉదాత్తమైన స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తోంది.)

Sumanth: It pays handsome salaries to its staff too. That's why the college is thriving.

(ఈ కళాశాల తమ సిబ్బందికి మంచి జీతాలు కూడా చెల్లిస్తుంది. అందుకే అది బాగా అభివృద్ధి చెందుతోంది.)

Shankar: A number of philanthropists have donated considerable sums to the college. That also adds to the smooth functioning of the college. That has been a great help.

(కళాశాలకు చాలామంది దాతలు చెప్పుకోదగిన విరాళాలు కూడా సమకూర్చారు. అది కూడా కళాశాల సాఫీగా సాగిపోయేందుకు తోడ్పడుతోంది.)

Sumanth: I wish there were plenty of such colleges in India, so that all Indians could get good education.

(భారతీయులు మంచి విద్య పొందేందుకు అలాంటి కళాశాలలు భారత్‌లో ఇంకా చాలా ఉండాలని నా కోరిక)

Note: 1) Populous = Crowded = జన బాహుళ్యం/ ఎక్కువ జనాభా ఉండే.

ముఖ్యంగా ఇది నగరాలకు, జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వాడతాం.

Kolkata is a populous city

జన సమ్మర్థం - విస్తీర్ణానికి మించిన జనాభా ఉన్న నగరం కోల్‌కతా.

2. Campus = Area in which an educational institution is/ విద్యాలయాల ఆవరణ

3. Reserve funds = funds (amounts of money) which can be used, when there is no money = ఉపయోగానికి డబ్బు లేనప్పుడు/ తక్కువైనప్పుడు వాడుకునే నిల్వ నిధులు.

4. Well provided for = supported financially

జీవిత అవసరాలకు తగినంత ఆర్థిక వనరులు ఉన్న

His children are well provided for = అతడు తన పిల్లల అవసరాలకు తగినంత డబ్బు సమకూర్చాడు.

Now look at the following sentences from the conversation above.

1) The college occupies a large area.

2) Very few colleges have such a vast campus.

3) ... the population is on the high side.

4) ... the college stood alone here, with immense open spaces around.

5) In addition, it charges a hefty fee.

6) A number of philanthropists have donated considerable sums.

7) That has been a great help.

      పైన Underline చేసిన మాటలన్నీ కూడా big = 'పెద్ద' అనే భావానికి సంబంధించినవి - ఎక్కువ అనే అర్థం కూడా స్ఫురించవచ్చు.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌