• facebook
  • whatsapp
  • telegram

Interfere in .. Interfere with

Santosh: You shouldn't have entered into the contract in Vasu's presence. He is a busybody with a wagging tongue.

(వాసు ఉండగా నువ్వా Contract ను కుదుర్చుకోకుండా ఉండాల్సింది. అతడు అందరి విషయాల్లో కల్పించుకుంటూ వాగుతూ ఉంటాడు.)

Anupam: What has he to do with it? It's my private affair. If he wags about it to others, I'll tell him not to poke his nose into my affairs.

(అతడికేం సంబంధం దీంతో. అది నా స్వవిషయం. దాన్ని గురించి ఇతరులతో వాగితే నా విషయాల్లో తలదూర్చొద్దని కచ్చితంగా చెప్పేస్తాను.)
 

Santosh: He has no manners. He does not know it is very important not to intrude upon other's affairs.

(అతడికి పద్ధతి లేదు. ఇతరుల విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం ముఖ్యం అని తెలియదు.)

Anupam: I knew he was meddlesome, but I haven't been aware that he can be such a nuisance.

(అతడు తనకు తెలియని విషయాల్లో తలదూరుస్తాడని నాకు తెలుసు కానీ, ఇంత ఇబ్బంది పెడతాడని అనుకోలేదు).

Santosh: He is a greater nuisance than you can imagine. I've told him a number of times to stayout of it but he hasn't changed.

(మనం ఊహించలేనంత ఇబ్బంది కలిగిస్తాడు. చాలాసార్లు చెప్పానతడికి, నా విషయాల్లో కల్పించుకోవద్దని, కానీ, అతడు మారలేదు).

Anupam: I will avoid him in future. I'll (I will) have nothing to do with him.

(ఇక ముందు అతడిని పట్టించుకోను. అతడితో అసలు పెట్టుకోను.)

Santosh: Tell him he'd (he had) better stay out of it.

(అతడితో చెప్పు, ఈ వ్యవహారాలకు దూరంగా ఉండమని (వాటి మానాన వాటిని వదిలేయమని))

Anupam: That'll (That will) surely have an effect.

(దానికి తప్పకుండా ఫలితం ఉంటుంది).

Santosh: Bye.

Look at the following expressions from the conversation above.

  1) He is a busybody with a wagging tongue.

  2) What has he to do with it?

  3) ... not to intrude upon others

  4) I have told him to stay out of it.

  5) I'll have nothing to do with him.

  6) I'll tell him not to poke his nose into my affairs.

పై expressions అన్నీ కూడా 'అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం/కల్పించుకోవడం' అనే అర్థాన్ని ఇస్తాయి.

ఇవన్నీ కూడా ‘Interfere'- కల్పించుకోవడం/ జోక్యం చేసుకోవడం అనే మాటకు వివిధ రూపాలు, సంబంధం ఉన్న మాటలు. వీటిలో కొన్ని చాలా వ్యావహారికమైనవి. వాటిని మన సంభాషణల్లో వాడి, సంభాషణను సహజంగా ఉండేలా చేసుకోవచ్చు.
Interfere =  సంబంధించని విషయాల్లో తలదూర్చడం.

a) Likith: You've (You have) been in this profession for quite sometime? How much have you saved?

(నువ్వు ఈ వృత్తిలో చాలాకాలంగా ఉన్నావు? ఏమైనా పొదుపు చేశావా?)

Lekhak: Sorry, don't interfere in my affairs. How much I've saved in my business, none of yours.

(క్షమించు. నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు- నీకెందుకు?- నేను ఎంత వెనకేసుకున్నాననేది నా స్వవిషయం, నీకు సంబంధం లేదు.)

b) Mohan: Hope the police would leave the agitators alone.

(పోలీసులు ఆందోళనకారులను వాళ్ల మానాన వాళ్లను వదిలేస్తారని ఆశిస్తున్నా.)

Mihir: The protesters are peaceful and I am sure the police will not interfere.

(నిరసనకారులు శాంతియుతంగా ఉన్నారు, అందుకని పోలీసులు జోక్యం చేసుకోరని నమ్ముతున్నా.)

Interfere ను మనం చాలా సందర్భాల్లో వాడుతుంటాం. అవి:

The law will take its own course. The Govt. should not interfere.

(చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు.)

Interfere in and interfere with - వీటి తేడా తెలుసుకోవడం అవసరం.

ఒకరి విషయాల్లో జోక్యం చేసుకోవడం - Interfere in;

ఒకరి ఆలోచనలను మార్చే ప్రయత్నం - Interfere with (ప్రభావితం చేయడం)

c) Natesh: Why has the court refused bail to the big wigs in Jail now?

(ప్రస్తుతం జైల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులకు కోర్టు బెయిల్ ఎందుకు తిరస్కరించింది?)

Nikhil: Because it feels that if they are free, they may interfere with the witnesses.

(వాళ్లు స్వేచ్ఛగా బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టు భావిస్తుంది).

సంభాషణల్లో వాడిన ఇదే అర్థం ఉన్న మిగతా expressions.

1) A busybody = A person who often interferes in others' affairs/ tries to advise them / one too interested in other people's matters = ఇతరుల విషయాల్లో తరచూ జోక్యం చేసుకుంటూ, అనవసర సలహాలు ఇచ్చేవాళ్లు/ ప్రతి ఒక్కరి విషయంలో తలదూర్చేవాళ్లు.

a) Navin: Who were you talking to, a few minutes ago?

(కొద్ది నిమిషాల కిందట ఎవరితో మాట్లాడుతున్నావు?)

Madhu: A neighbour of ours. He is a busybody, who none of his neighbours can escape.

(మా పొరుగింటాయనతో. ఉత్త ఆరాల మనిషి. ఆయన్నుంచి పొరుగువాళ్లెవరూ తప్పించుకోలేరు.)

b) Shanmukh: Talk low. Keep your voice down. (నిదానంగా మాట్లాడు. గొంతు తగ్గించు)

Omkar: What's the matter? (ఏంటి విషయం?)

Shanmukh: Look around. The one that is approaching us is a blooming busybody. I don't want him to see us.

(చూడు. మన దగ్గరకొస్తున్న వ్యక్తి ఉత్త ఆరాల మనిషి. అతడికి అక్కరలేని విషయం అంటూ లేదు. అతడు మనల్ని చూడటం నాకిష్టం లేదు.)

2) To do with = To be connected with = సంబంధం ఉండటం.

a) Pranav: So dad bye then. I am leaving for the University. Anything you've got to say?

(నాన్నా, నేను మా యూనివర్సిటీకి వెళ్తున్నా. ఏమన్నా చెప్పాల్సింది ఉందా?)

RamaRao: Just one thing. Don't have anything to do with/ have nothing to do with student politics.

(ఒక్కటే. విద్యార్థి రాజకీయాలతో సంబంధం పెట్టుకోకు).

ఇది చాలా ఉపయోగకరమైన, తరచూ వాడే Phrase. మీ సంభాషణలో ఉపయోగించండి.

b) All the ministers accused claim that they have nothing to do with Raghu's affairs.

ముద్దాయిలుగా పేర్కొన్న మంత్రులందరూ తమకు రఘు విషయంలో ఏం సంబంధం లేదని అంటున్నారు.

(Accused = ముద్దాయి(లు)) (claim = చెప్పుకోవడం)

c) What have I to do with the accident?

నాకూ ప్రమాదానికి ఏం సంబంధం?

3) Intrude upon: to be at/ go to a place where you are not wanted = మనం ఉండకూడని చోట ఉండటం/ వెళ్లకూడని సందర్భంలో వెళ్లడం.

Suppose two people are talking to each other. Going to them and joining them is intruding.

ఇతరులేదో మాట్లాడుకుంటుంటే వాళ్ల మధ్యలో దూరి కల్పించుకోవడం - intruding upon/ Intrusion

a) Umesh: I am leaving this company. I can't work here any longer.

(నేనీ కంపెనీ వదిలేస్తున్నా. ఇక ఇక్కడ ఏ మాత్రం పనిచేయలేను).

Sukumar: What's (What has) happened? (ఏం జరిగింది?)

Umesh: The company doesn't have the right to intrude upon my personal life. Why do they want to know what I do at my leisure time, where I go on holidays etc.

(నా వ్యక్తిగత జీవితంలో కల్పించుకునే హక్కు కంపెనీకి లేదు. తీరికవేళల్లో నేనేం చేస్తాను, సెలవుల్లో ఎక్కడికి వెళ్తాను, ఇవన్నీ వాళ్లకెందుకు).

b) Sarath: What do you want? Giri? (ఏం కావాలి గిరి?)

Giri: Oh, I didn't know you were talking to your friend. Sorry for intruding upon you.

(నీ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నావని నాకు తెలియదు. క్షమించు. మీకు ఇబ్బంది కలిగించినందుకు)

c) Am I intruding on your privacy? Sorry.

(మీరేదో వ్యక్తిగతమైన పని మీదున్నట్లున్నారు. నేనేం ఇబ్బంది కలిగించడం లేదు కదా?)  S

4) To stayout of something = జోక్యం చేసుకోకుండా ఉండటం.

a) Sekhar: What are they quarrelling about?

(వాళ్లు ఏ విషయం గురించి పోట్లాడుకుంటున్నారు?)

Mahesh: It's a matter between the wife and the husband. You had better stay out of it.

(అదేదో భార్యాభర్తల మధ్య విషయం. నువ్వు కల్పించుకోకుండా ఉండటం మంచిది.)

b) Nethaji: What's your problem with your father?

(మీ నాన్నగారితో నీకేంటి గొడవ?)

Prathap: Is it any of your business? It's something between me and my father. You stay out of it and let me handle it myself.

(నీకెందుకు? ఇది నాకూ, మా నాన్నకూ సంబంధించిన విషయం. నువ్వేం కల్పించుకోకు. నాకొదిలెయ్.) (Stay out of it = దాదాపు నోర్మూసుకో.)

Stay out of it = keep out of it.

5) Poke your/ one's nose/ stick your nose (into others' affairs) = interfere = తలదూర్చడం/ చికాకు కలిగించేవిధంగా అనవసర విషయాల్లో కల్పించుకోవడం.

a) Jagan: I see you are packed. Where are you going? Alone or with your wife? You'd better take your wife too. Let her enjoy too.

(ఏంటంతా పెట్టే బేడా సర్దేశావు? ఎక్కడికెళ్తున్నావు? ఒంటరిగానా, భార్యతోకూడానా? ఆమెనూ తీసుకెళ్లు, ఆమెకు కూడా సరదాగా ఉంటుంది.)

Samir: Shut up. Don't you poke your nose into my affairs. Mind your business.

(నోర్మూసుకో. నా విషయాల్లో తలదూర్చకు. నీ పని నువ్వు చూసుకో).

b) Tarun: Kumar was asking me yesterday about your salary and if you were saving any money. He wanted to know how you were able to buy this house?

(నిన్న కుమార్ నీ జీతం గురించి, నీ పొదుపు గురించి నన్ను అడుగుతున్నాడు. ఈ ఇల్లు ఎలా కొనగలిగావు అని కూడా అడిగాడు.)

Venkat: Why didn't you tell him not to poke/ stick his nose into things that don't concern him?

(తనకు సంబంధంలేని విషయాల్లో తలదూర్చొద్దని ఎందుకు చెప్పలేదు నువ్వు?)

గమనించాం కదా, జోక్యం చేసుకోవడం/ కల్పించుకోవడం/ తలదూర్చడం/ ఆరాలు తీసే స్వభావం లాంటి అర్థాలు తెలిపే English expressions. వీటిని మనం సంభాషణలో వాడదాం.

ఇవి కూడా చూడండి: Leave well alone/ Let well alone = వదిలెయ్ అని అర్థం.

Venu: I should have left well alone/ let well alone and never told the police about it.

(police తో చెప్పకుండా, ఆ విషయం అంతటితో వదిలేసి ఉండాల్సింది నేను.)

Venkat: Yea, that'd have been better. (అవును. అది మెరుగ్గా ఉండేది).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌