• facebook
  • whatsapp
  • telegram

On the spot, In a jiffy 

Sudha: Won't you do this for me? Be a good girl. Sit down at once and help me complete this assignment.

 

 (మంచిదానివి కదా! కాస్త ఈ పనిచేసి పెట్టవా? వెంటనే కూర్చుని ఈ అసైన్‌మెంట్ పూర్తి చేయడానికి సహాయం చెయ్యి.)Sampurna: What's' the hurry now? Is it to be done immediately? Today is Friday and I am sure it can wait till Monday.

(ఇప్పుడేం తొందర? వెంటనే చేయాలా? ఈరోజు శుక్రవారం. సోమవారం దాకా ఆగొచ్చని అనుకుంటున్నా.)

Sudha: Oh, no it's already overdue. It has to be done right away as it should be submitted tomorrow by 7.30 in the morning.

(కుదరదు. ఇప్పటికే గడువు దాటిపోయింది. ఇదిప్పుడు వెంటనే చేయాలి. రేపు ఉదయం 7.30 కల్లా చూపించాలి.)

Sampurna: That's very much like you, always late to complete. Why don't you do the assignments as soon as they are given? You know they are urgent and have got to be done, sooner or later. Then why not sooner than later?

(నువ్వు ఎప్పుడూ అలాగే చేస్తావు, పని పూర్తి చేయడం ఎప్పుడూ ఆలస్యమే. Assignments ఇచ్చిన వెంటనే ఎందుకు పూర్తి చేయవు? మనం త్వరగానైనా ఆలస్యంగానైనా చేయాల్సిందే గదా? తర్వాత కంటే ముందే చేయొచ్చు కదా!)

Sudha: Easier said than done, you know. Aren't you late at any time?

(చెయ్యడం కంటే చెప్పడం సులభమే. నువ్వెప్పుడూ ఆలస్యమే చేయవా?)

Sampurna: Me, late! Never. Once I am given an assignment, I lose no time in completing it, come rain or Sun.

(నేనా, ఆలస్యమా? ఎప్పుడూ లేదు. నాకు అసైన్‌మెంట్ ఇస్తే వెంటనే పూర్తి చేస్తా. ఎండైనా వానైనా.)

Sudha: Thank God, you didn't say you do it then and there.

 (పోన్లే నయం. అక్కడే అప్పుడే చేసేస్తాను అనలేదు.)

Sampurna: You can say that and you won't be far wrong. I do it almost on the spot, I mean, if I have time at the college.

 (నువ్వు అలా అన్నా కూడా తప్పుకాదు. దాదాపు అప్పటికప్పుడు చేసేస్తాను. కాలేజ్‌లో నాకు సమయం ఉంటే.)

Sudha: What's it you are having now, coffee? You seem to have made it in a jiffy.

 (ఏం తాగుతున్నావు? కాఫీనా? ఒక క్షణంలో చేసేసినట్టున్నావు.)

Sampurna: It's instant coffee, you know.

 (ఇది ఇన్‌స్టంట్ కాఫీ, తెలుసు కదా?)

Look at the following expressions from the conversation above:

        1) Sit down at once.

        2) It is to be done immediately.

        3) It has to be done right away.

        4) Why don't you do the assignment as soon as it is given?

        5) I lose no time in completing it.

        6) You didn't say you do it then and there.

        7) I do it almost on the spot.

        8) You seem to have made it in a jiffy.

        9) It's instant coffee.

పై మాటలన్నీ తక్షణం, వెంటనే అనే భావాలను తెలపడానికి ఉపయోగపడతాయి.

1. At once = తక్షణమే/ వెంటనే

   a) Your mother wants you back home at once.

        (మీ అమ్మ నిన్ను వెంటనే ఇంటికి రమ్మంటోంది.)

   b) They want to leave this place at once.

        (వాళ్లిక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలనుకుంటున్నారు.)

2. Immediately = వెంటనే (without any delay)a) As the baby had a fever she called the doctor immediately.

        (బిడ్డకు జ్వరంగా ఉండటంతో ఆమె వెంటనే డాక్టర్‌కు ఫోన్ చేసింది.)

b) Immediately after seeing the letter he started for home.

        (ఆ ఉత్తరం చూసిన వెంటనే అతడు ఇంటికి బయల్దేరాడు.)

3. Right away = at once = తక్షణం - At once, right away and also straight away.

    ఈ మూడు కూడా తక్షణం అనే అర్థంతో వాడతాం. అంటే ఇందులో immediately కంటే కూడా urgency ఎక్కువ.

             మనం ఏదైనా urgency గా (అసలు ఆలస్యంగా లేకుండా) చేయాల్సి వస్తే అప్పుడుAt once, right away and also straight away వాడతాం.

a) On hearing the news she rushed home straight away/ right away.

    (ఆ వార్త వినగానే, ఆమె ఇంటికి పరుగు పరుగున బయల్దేరింది.)

    To rush = హుటాహుటిన/ ఉన్నపళంగా బయలుదేరడం.

    To rush something = దేన్నయినా urgent గా పంపడం.

The air force is rushing food and clothes to the areas in floods.

(వైమానిక దళ సిబ్బంది వరదల్లో ఉన్న ప్రదేశాలకు ఆహారం, వస్త్రాలు అతి వేగంగా తీసుకెళుతున్నారు.)

4. As soon as = ఇది కూడా వెంటనే అనే అర్థం ఇస్తుంది. అయితే, At once/ right away/ straight away/ immediately కంటే కాస్త urgency తక్కువ.    a) As soon as he saw the police he ran away.

(పోలీస్‌లను చూసిన వెంటనే/చూసీచూడగానే అతడు పారిపోయాడు.)
 

    b) As soon as I go home, I will call you.

        (నేను ఇంటికి చేరగానే నీకు phone చేస్తాను.)

5. Lose no time in doing something = వెంటనే చేసేయడం (ఆలస్యం లేకుండా) Lose (Present tense) - Lost (Past tense) - Lost (Past participle).   a) When the prices came down, he lost no time in buying the car.

      (ధరలు తగ్గగానే, అతడు ఏమాత్రం సమయం వృథా చేయకుండా ఆ కారు కొనేసాడు.)

    b) When she knew the secret she lost no time in passing it on to her lover.

        (రహస్యం తెలియగానే వెంటనే ఆమె దాన్ని తన ప్రేమికుడికి అందజేసింది.)

6. There and then/ then and there = అక్కడికక్కడే, అప్పటికప్పుడే/ ఉన్నపళాన   a) She saw the jewel, and thought she should have one such then and there.

         (ఆ నగ చూసిన ఆమె అప్పటికప్పుడు తనకు అలాంటి నగ ఉండాలని అనుకుంది.)

   b) Vineela stand have given it to Suneetha then and there.

         (వినీల దాన్ని సునీతకు వెంటనే ఇచ్చేసి ఉండాల్సింది.)

7. On the spot = తక్షణం. 

     a) They want on the spot payment.

          (వాళ్లకు తక్షణ చెల్లింపు కావాలి.) (on the spot = ఉన్నచోటనే)

     b) Seeing that they did not like him, he resigned on the spot.

          (వాళ్లకు తను ఇష్టంలేదని గ్రహించి వెంటనే/తక్షణం అతడు రాజీనామా చేశాడు.)

     c) The police fined the driver on the spot.

          (పోలీసులు డ్రైవర్‌కు అక్కడికక్కడే జరిమానా విధించారు.)

8. In a jiffy = క్షణంలో

    a) A: Don't trouble yourself. I don't want coffee (బాధపడకు. coffee వద్దు.)

         B: No trouble at all. You will have coffee in a jiffy.

             (Trouble ఏమీ లేదు. కాఫీ ఒక్క క్షణంలో చేస్తాగా.)

    b) However rich you are, you can't get a car in a jiffy.

         (నీకు ఎంత డబ్బున్నా, car ఒక్కక్షణంలో రాదు.)

    c) Nobody becomes great in a jiffy.

         (ఎవరూ ఒక క్షణంలో గొప్పవాళ్లు కాలేరు.)

9. Instant = తక్షణం.

    దీనివాడకం Instant coffee, Instant map లాంటి వాటిలో చూస్తుంటాం. ఇవి మనకు పరిచయమే కదా.

    a) An instant decision on such matters is impossible.

         (అలాంటి విషయాల్లో తక్షణ నిర్ణయం అసాధ్యం.) (Decision = నిర్ణయం)

    b) The minute I saw him I had an instant dislike for him.

         (అతడిని చూడగానే నాకు తనంటే ఆ క్షణాన్నే అయిష్టత కలిగింది.)

         దీనిలాంటిదే మరో మాట - instantaneous దీని అర్థం కూడా తక్షణమే

The accident caused his instantaneous death.

తక్షణం/ వెంటనే అనే అర్థంతో పైమాటలే కాకుండా మరికొన్ని మాటలు కూడా ఉన్నాయి.

a) In no time: Sulekha heard the news of her friend's success and was in no time was congratulating her.

    (తన స్నేహితురాలి విజయం విన్న వెంటనే సులేఖ ఆమెను అభినందించింది.)

b) It's time for my train and in no time I will be leaving for the station.(ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మరణించాడు.)
 

   (నా ట్రెయిన్ సమయం అయ్యింది, నేనిప్పుడే బయలేదేరుతున్నా.)

ఇదే అర్థంతో, అంటే వెంటనే / తక్షణం అనే అర్థంతో ఇంకో expression - right off.

a) The minute the teacher asked the question, he gave the answer right off.

     (టీచర్ ప్రశ్న అడిగిన వెంటనే అతడు సమాధానం చెప్పేశాడు.)

b) I cannot say right off when I will be starting my business.

     (ఎప్పుడు వ్యాపారం ప్రారంభిస్తాననే విషయం ఇప్పటికిప్పుడు/ ఈ క్షణంలో చెప్పలేను.)

      దీనికి సంబంధించిందే, ఐతే అర్థంతో మరో మాట చూడండి. Right off my head, (ఇప్పటికిప్పుడు అనే అర్థంతో)

a) Is he a computer to give you the information right off his head?

(ఇప్పటికిప్పుడు/ నువ్వు కావాలనుకునే సమాచారం ఇవ్వడానికి అతడేమన్నా కంప్యూటరా?)

b) He is so through with the subject that he can tell you anything about it right off.

      (ఆ విషయం గురించి ఏదడిగినా వెంటనే చెప్పగలిగేటంత క్షుణ్నంగా తెలుసు అతడికా విషయం.) ఇందాక As soon as = వెంటనే అనే phrase చూశాం కదా? అదే అర్థంతో వ్ని No sooner... than అని వాడొచ్చు. అయితే No sooner... than వాడేటప్పుడు subject ముందు verb వచ్చేలా చూసుకోవాలి.
 

As soon as he bought the book, he started reading it.(పుస్తకం కొనగానే చదవడం ప్రారంభించాడు.)

ఇప్పుడిక్కడ As soon as బదులు, No sooner than వాడొచ్చు.

No sooner did he buy the book, than he started reading it.

గమనించండి: As soon as he bought the book = No sooner did he buy the book.

Bought = did buy గా రాస్తే, did తర్వాత subject 'he' వస్తుంది. అంతే కాకుండా, No sooner తో than తప్పక వాడతాం, sooner, comparative degree కాబట్టి అప్పుడు.

As soon as he bought the book, he started reading it = No sooner did he buy the book than he started reading it.

As soon as he saw me, he came to me = No sooner did he see me than he came to me

No sooner లాగే, Hardly... When/ Scarcely... when అని కూడా అనొచ్చు.

As soon as he saw me, he came to me = No sooner did he see me, than he came to me = scarcely/ Hardly did he see me, when he came to me.

Instant, Immediate, Instantaneous (తక్షణం) తో దాదాపు సమానమైన మాట ''swift'.

The police action was swift and all the demanstrators were scattered.

(పోలీసులు వెంటనే చర్య తీసుకోవడంతో ప్రదర్శకులు చెల్లాచెదురయ్యారు.)

scatter = చెల్లాచెదరవడం

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌