• facebook
  • whatsapp
  • telegram

Rough guess ... Wild guess

Abhiram: Do you know how many marks Kedar got in the exam last year?

(గతేడాది పరీక్షలో కేదార్‌కు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?)

Aparna: I'm (I am) not sure. I can only guess. I think he got somewhere around 85%.

(నేను కచ్చితంగా చెప్పలేను. ఊహించి చెప్పగలను. అతడికి సుమారుగా 85% వచ్చిందనుకుంటా.)

Abhiram: No. I am afraid you are far off the mark. I put it at anything around 95%. Remember he stood first in the college.

(కాదు. నీ ఊహ వాస్తవ విలువకు చాలా దూరంగా ఉందని భావిస్తున్నాను. నేను 95% దగ్గర ఉండవచ్చని అనుకుంటున్నాను. అతడు కాలేజ్ టాపర్ అని గుర్తుంచుకో.)

Aparna:  The estimates of the lectures are that this time at least ten students will get more than that.

(ఈసారి కనీసం పది లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు తొంభై అయిదు శాతం కంటే ఎక్కువ మార్కులు పొందుతారని అధ్యాపకుల అంచనా.)

Abhiram: That certainly is a rough guess. The actual number may be even more than that. For one thing, the college this time had reopened earlier and the students had more time to prepare.

(అది అంత కచ్చితం కాని ఊహే. అసలు సంఖ్య అంత కంటే ఎక్కువే ఉండొచ్చు. మరో విషయం ఏమిటంటే... ఈసారి కాలేజీ ముందే తెరిచారు, విద్యార్థులు సిద్ధమవడానికి ఎక్కువ సమయం లభించింది.)

Aparna:  My hunch is that our friend Neelaveni might top the list of high achievers.

(ఎక్కువ మార్కులు సాధించేవారి జాబితాలో మన స్నేహితురాలు నీలవేణి ముందుంటుందని నేను అనుకుంటున్నాను.)

Abhiram: I don't agree with you. Even a wild guess cannot rate her as the topmost. You have overlooked Mihir.

(నీతో నేను ఏకీభవించను. ఎంత ఆధారంలేని ఊహలోనైనా ఆమెను అందరి కంటే ముందుంచలేను. మిహిర్ విషయం మర్చిపోకూడదు.)

Aparna:  Mine was just a shot in the dark. You may be right.

(నేను చెప్పింది చీకట్లో వేసిన బాణం లాంటిది. నువ్వే కరెక్ట్.)

Abhiram: All this is, I admit, and so should you, is just guesswork. It is better for us to wait till the results are out.

(ఇదంతా ఊహ మాత్రమే. నేను అంగీకరిస్తున్నాను. నువ్వూ అంగీకరించాలి. ఫలితాలు వచ్చేదాకా వేచి ఉండటం మంచిది.)

Aparna:  I hope you have noticed it. There has been a lot of speculation about the postponement of exams and the method of selection of candidates for the entrance exams.

(నువ్వు గమనించావని అనుకుంటున్నా. ఈసారి పరీక్షల వాయిదా, ప్రవేశ పరీక్షకు విద్యార్థుల ఎంపిక గురించి చాలా ఊహాగానాలు జరిగాయి.)

Abhiram: Let's wait and see. (చూద్దాం.)

Now look at the following sentences from the conversation above:

       1) I can only guess/ That certainly is a rough guess/ That is a wild guess.

       2) I put it at anything around 95%.

       3) The estimates of the lectures.....

       4) My hunch is that our friend.....

       5) All this ..... just guess work.

       6) There has been a lot of speculation about the postponement.....

       The word we are discussing in this lesson is, 'guess'.

'Guess' means

     1) Think or suppose

     2) Say what you think of something without knowledge of facts.

ఇప్పుడు మనం'guess', దానికి సంబంధించిన ఇతర మాటలు గురించి తెలుసుకుందాం.

1) Guess (గెస్) =

                    1) అనుకోవడం/ ఊహంచుకోవడం

                    2) నిజం సరిగ్గా తెలియనప్పుడు  ఒక విషయం గురించి మనకు ఉండే ఊహ.

a) Krishna: Did you answer all the questions?

(అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశావా?)

Amruth: I did. But I did not know all the answers so I guessed some of them. I hope my guesses are correct.

b) Rahim: (Have you) Any idea where we can get some good ripe mangoes?(చేశాను. కానీ నాకు అన్ని ప్రశ్నలకు జవాబులు తెలియవు. కాబట్టి కొన్నింటిని ఊహించాను. నా ఊహ కరెక్టేనని అనుకుంటున్నాను.)

(మగ్గిన మామిడి పండ్లు మనకు ఎక్కడ దొరుకుతాయో నీకేమైనా తెలుసా?/ నువ్వేమైనా చెప్పగలవా?)

Vinai: My knowledge of this place is only slightly better than yours. I guess the right place is the Sarvalabha Super Market.

(ఇలాంటి విషయాల గురించి నీకంటే నాకే కొంచెం ఎక్కువగా తెలుసు. సర్వలాభ సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయని అనుకుంటున్నాను.)

Make a guess =

Guess something when explaining how something might have happened

ఉజ్జాయింపుగా అనుకోవడం/ చెప్పడం

Chakri: Why do you think he is late? What might have happened?

(అతడికి ఎందుకు ఆలస్యమైందని అనుకుంటున్నావు నువ్వు? ఏం జరిగి ఉండవచ్చు?)

Santhan: How do I know? I can only make a guess. He must have been caught in a traffic jam.

(నాకెలా తెలుస్తుంది? నేను ఊహించాను అంతే. అతడు ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కుని ఉండొచ్చు.)

Rough guess = The number or amount we give when we are not sure of the exact number or amount

= అంత కచ్చితం కాని ఊహ.

a) Venkat: How many, do you think, saw the movie on the day of its release?

(ఆ చిత్రం విడుదలైన రోజున ఎంతమంది చూశారని అనుకుంటున్నావు?)

Sravan: The figure the movie people give is 27 lakh, but I think it is only a rough guess.

(ఆ సినిమావాళ్లేమో 27 లక్షల మంది చూశారని అనుకుంటున్నారు, కానీ అది కేవలం ఊహే/ అంత కచ్చితంకాని ఊహేనని నేను అనుకుంటున్నాను.)

b) Suman: How old do you think the actor is?

(ఆ నటుడి వయసు ఎంతనుకుంటున్నావు?)

Jairam: I'd (I would) say he is about 35, but that's only a rough guess.

(35 సంవత్సరాలు కావచ్చు. కానీ అదంత కచ్చితం అని చెప్పలేను. నా ఊహ మాత్రమే.)

A wild guess = A guess especially in an answer that is stupid or very wrong.

     = ఏదైనా ప్రశ్నకు తప్పుగా లేదా తెలియనప్పుడు ఊహించి ఇచ్చే సమాధానం.

Prasad: Where does the Ganga empty into the sea?

(గంగానది సముద్రంలో ఎక్కడ కలుస్తుంది?)

a) Prakash: I think somewhere in Odisha sir.

(ఎక్కడో ఒడిశాలో అనుకుంటానండి.)

Prasad: That's a wild guess, isn't it? You don't know the answer. That's it.

(ఏదో ఊహించుకుని చెప్పావు కదా! నీకు జవాబు తెలియదు. అదీ సంగతి.)

b) Vinai: Guess who is going to teach us Maths this year?

(ఈ సంవత్సరం మనకు లెక్కలు ఎవరు బోధిస్తారో చెప్పు.)

Kaivalya: Mine can only be a wild guess, because I don't know.

(నేను ఊహించి మాత్రమే చెప్పగలను. ఎందుకంటే  నాకు సమాధానం తెలియదు.)

2) Put (something) at = To guess the cost/ value/ age/ amount of damage etc.

a) Virat: (Have you) Any idea how much the building would cost?ధరలు, పరిమాణం లాంటివాటిని ఉజ్జాయింపుగా ఊహించుకోవడం. (ఒక వస్తువు విలువ, వయసు/ జరిగిన నష్టం లాంటివాటిని.)

(ఆ కట్టడం విలువ ఎంతో ఏమైనా చెప్పగలవా?)

Harish: I put it at any where between Rs. 90 lakh and one crore.

(తొంభై లక్షలూ, కోటి మధ్య ఉండొచ్చని నా అంచనా.)

b) The engineers put the cost of the dam at Rs. 200 Crore.

ఆ డ్యామ్ మీద వ్యయం 200 కోట్ల రూపాయలు ఉండొచ్చని ఇంజినీర్ల అంచనా.

3) Estimate: State the price of something, the number of things/ people at a place etc., partly by calculations and partly by guessing.

a) Tirumalesh: How many pilgrims, do you think, are in the queue for the darshanam?

(దర్శనానికి ఎంతమంది యాత్రికులు క్యూలో ఉన్నారనుకుంటున్నావు?)విలువకట్టడం/ అంచనా వేయడం కొంత లెక్క చేయడం ద్వారా, కొంత ఊహించడం ద్వారా.

 Padma: Going by the time we have to wait in the queue for, I estimate the crowd to be around five thousand to six thousand.    

(మనం క్యూలో ఉండాల్సిన సమయాన్ని బట్టి చూస్తే, 5000 నుంచి 6000 మంది ఉండొచ్చని అంచనా.) (crowd = గుంపు)

b) Vikas: What might be loss caused by the floods?

(వరదల వల్ల కలిగిన నష్టం ఎంత ఉండొచ్చు?)

Sunath: The engineers and the revenue officials estimate the loss to be in hundreds of crores.

నష్టం వందల కోట్లలో ఉండొచ్చని ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు/ ఇంజినీర్లు, రెవెన్యూ అధికారుల అంచనా ప్రకారం నష్టం వందల కోట్ల రూపాయలు.

4) Hunch

            = A feeling that you know what is going to happen, though you cannot prove it.

      = మనకప్పుడప్పుడు ఏదో జరగబోతోందని కలిగే భావన, అయినప్పటికీ మనం దాన్ని నిరూపించలేం.

a) Subhas: You are trying to say something, aren't you? Out with it.

(ఏదో చెప్పాలని అనుకుంటున్నావు కదా? అదెదో చెప్పు.)

Murali: I have a hunch, it's only a hunch mind you, but it is possible that Mitra has stolen the money.

b) My hunch that we might lose the game turned out to be true.

(మనం ఓడిపోవచ్చనే నా భావన నిజమైంది.)(నాకేదో అనిపిస్తోంది, అది నా ఊహ మాత్రమే సుమా! ఆ డబ్బు దొంగిలించింది మిత్రా అనే అనిపిస్తోంది.)

5) Guess work = Trying to find an answer by guessing (when we don't have information about something) ఊహాగానం.

a) Kumar: Don't disturb me. I am trying to guess our customers' tastes.

(మన కస్టమర్ల అభిరుచులను ఊహించేందుకు ప్రయత్నిస్తున్నా. నన్ను disturb చేయకు.)

Kailas: Conduct a survey and find out what suits the customer rather than waste time on guess work.

(ఇలాంటి ఊహాగానంతో కాలయాపన చేసే బదులు, ఒక సర్వే జరిపి, కస్టమర్లకు సరిపోయేదేదో కనుక్కో.)

b) Sundar: I wonder why the police took such a long time to solve the case.

(ఆ కేసును ఛేదించడానికి పోలీసులు అంత సమయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు.)

Pranav: In the beginning investigation was largely based on guess work

( మొదట్లో వాళ్ల పరిశోధనంతా ఊహలతో జరిగింది.)

6) Speculation = Almost the same as guesswork, but by a number of people = చాలామంది చేసే ఊహ/అనుకోవడం.

a) Charan: Why is the minister resigning?

(ఆ మంత్రి ఎందుకు రాజీనామా చేస్తున్నాడు?)

Tarun: There has been a lot of speculation about the cause, but no one is clear. It is perhaps the fear of corruption charges against him.

(ఆ కారణం గురించి చాలామంది రకరకాలుగా అనుకున్నారుగానీ, ఎవరికీ స్పష్టంగా తెలియదు. అవినీతి ఆరోపణలకు భయపడి చేసి ఉండొచ్చు.)

b) Kundan: Now that another minister's name has come up in a scam, what's going to happen?

(ఇప్పుడు ఓ కుంభకోణంలో మరో మంత్రి పేరు బయటికొచ్చింది కదా! ఏం జరగొచ్చు?)

Sheriff: The speculation is that he will be asked to resign.

(ఆయన్ను రాజీనామా చేయమంటారని అందరూ అనుకుంటున్నారు.)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌