• facebook
  • whatsapp
  • telegram

TSPSC: పెరగనున్న గ్రూప్ 2, 3 పోస్టులు    

* అదనపు ఖాళీల వివరాలు కోరిన ఆర్థికశాఖ

ఈనాడు, హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్-2, 3 ఉద్యోగ ఖాళీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం నోటిఫై చేసిన పోస్టులకు అదనంగా మరిన్ని చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ విభాగాల వారీగా ప్రస్తుతం ఉన్న.., వచ్చే ఏడాదిలోగా ఏర్పడనున్న ఖాళీలను గుర్తించాలని సూచించింది. ఈ వివరాలను వెంటనే అందించాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు విభాగాధిపతులకు లేఖ రాశారు. ఈ ఏడాదిలో జరగనున్న గ్రూప్ 2, 3 పోస్టుల రాతపరీక్షలకు ముందుగానే అదనపు ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని, పోస్టుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్లు ఉద్యోగార్థులు భావిస్తున్నారు. 2022లో నోటిఫై చేసిన గ్రూప్2 పోస్టులు ప్రస్తుతం 783 ఉన్నాయి. ఈ పోస్టులకు రాతపరీక్షల తేదీలు గత ఏడాది నుంచి మూడుసార్లు వాయిదా పడ్డాయి. తాజాగా ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 3లో 1388 పోస్టులకు ఈ ఏడాది నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ షెడ్యూలు ఖరారు చేసింది. ప్రస్తుత నోటిఫికేషన్లలోనే ఉద్యోగాల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరీక్షలు జరిగే వరకు పోస్టుల సంఖ్యలో మార్పులు చేర్పులకు అవకాశాలున్నట్లు కమిషన్ ప్రభుత్వం భావిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎదురయ్యే న్యాయసమస్యలపై సమాలోచనలు జరుపుతున్నాయి. ఈక్రమంలో వచ్చే ఏడాదిలోగా ఏర్పడనున్న ఖాళీలతో పాటు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తే వచ్చే అదనంగా వచ్చే పోస్టులపైనా కసరత్తు జరుగుతోంది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.