• facebook
  • whatsapp
  • telegram

అగ్రిసెట్‌లో 2,538 మంది ఉత్తీర్ణత 

ఈనాడు, అమరావతి: అగ్రిసెట్‌ - 2021 ఫలితాలు సెప్టెంబ‌రు 15న‌ విడుదలయ్యాయి. వ్యవసాయ పాలిటెక్నిక్‌ నుంచి అల్లు రమ్య (మార్టేరు), నంబూరి ప్రసాద్‌ (తణుకు), గుదేటి సురేంద్రవర్మ (గరికపాడు), విత్తన సాంకేతిక పాలిటెక్నిక్‌ నుంచి చందా అనున్య (రుద్రూరు, తెలంగాణ), వన్నెల భూమరాజు (తునికి, తెలంగాణ), కొండపర్తి రమ్యశ్రీ (రుద్రూరు, తెలంగాణ), సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్‌ నుంచి మువ్వల గంగా భవాని (చింతపల్లి), లాలం దేవి (చింతపల్లి), గొల్లపల్లి గీతసాయి (చింతపల్లి) అధిక మార్కులు సాధించి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్ర కార్యాలయంలో ఉప కులపతి డాక్టర్‌ ఆడాల విష్ణువర్ధన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబ‌రు 13న నిర్వహించిన పరీక్షకు మొత్తం 2,570 మంది హాజరవ్వగా.. 2,538 మంది అర్హత సాధించారని వివరించారు. వీరిలో 1,392 మంది బాలికలు, 1,146 మంది బాలురు ఉన్నారని చెప్పారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఏజీ బీఎస్సీ(హానర్స్‌)లో ప్రవేశం కల్పించేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం సీట్లలో వీరికి 15% కోటా ఉంటుంది. 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

లక్ష్య సాధనకు దివిటీ! 

Cheat... Back up

Posted Date : 16-09-2021