విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Inter supply exams: మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

* ఒకే రోజు రెండు విడతలుగా ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు

* అదే నెల 1 నుంచి 4 వరకు ప్రాక్టికల్స్‌ 

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యామండలి వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం వారికి, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఒకే రోజు రెండు విడతలుగా ఇవి జరుగుతాయి. నైతికత, మానవ విలువల పరీక్ష జూన్‌ 6న, పర్యావరణ విద్య 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్‌ పరీక్షలు మే ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు రెండు విడతలుగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. 

తేదీ సబ్జెక్టు
మే 24 రెండో భాష పేపర్‌-1, 2
25 ఆంగ్లం పేపర్‌-1, 2
27 గణితం పేపర్‌-1ఏ, 2ఏ
వృక్షశాస్త్రం పేపర్‌-1, 2
పౌరశాస్త్రం పేపర్‌-1, 2
28 గణితం పేపర్‌-1బీ, 2బీ
జంతుశాస్త్రం పేపర్‌-1, 2
29 చరిత్ర పేపర్‌-1, 2
భౌతికశాస్త్రం పేపర్‌-1, 2
ఆర్థిక శాస్త్రం పేపర్‌-1, 2
30 రసాయనశాస్త్రం పేపర్‌-1, 2
కామర్స్‌ పేపర్‌-1, 2
సోషియాలజీ పేపర్‌-1, 2
ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్‌ పేపర్‌-1, 2
31 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, 2
లాజిక్‌ పేపర్‌-1, 2
బ్రిడ్జికోర్సు గణితం పేపర్‌-1, 2
జూన్‌ 1 మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 2
జాగ్రఫీ పేపర్‌-1, 2

Updated at : 26-04-2024 14:23:53

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం