• facebook
  • whatsapp
  • telegram

AP PGCET: ఏపీ పీజీ సెట్‌ షెడ్యూలు విడుదల  

* 139 కోర్సులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ


యోగి వేమన విశ్వవిద్యాలయం(కడప), న్యూస్‌టుడే: ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ పీజీసెట్‌) - 2021 షెడ్యూలును కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి మునగాల సూర్యకళావతి సెప్టెంబ‌రు 15న‌ విడుదల చేశారు. తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ కళాశాలల్లోని కోర్సులకు ఒకే నోటిఫికేషన్‌ ద్వారా సీట్లు భర్తీ చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ప్రవేశాల ప్రక్రియ బాధ్యతలను యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. సెట్‌ కన్వీనరు ఆచార్య వై.నజీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ఉన్న 139 కోర్సులకు ఏపీ పీజీ సెట్‌ ద్వారా మాత్రమే ప్రవేశాలు జరుగుతాయన్నారు. సెప్టెంబ‌రు 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలు అక్టోబరు 22న జరుగుతాయన్నారు. పూర్తి వివరాల కోసం ‌www.yogivemanauniversity.ac.in,  www.yvu.edu.in,  http://sche.ap.gov.in  వెబ్‌సైట్లను చూడాలన్నారు.

 

 

మ‌రింత స‌మాచారం... మీకోసం!

చిక్కులకు సైకాలజీ చెక్‌!

ఫ్లిప్‌కార్ట్‌లో 1.5 లక్షల సీజనల్‌ ఉద్యోగాలు

 

 

 

Posted Date : 16-09-2021