• facebook
  • whatsapp
  • telegram

APPSC: ఓపెన్‌ పోస్టులకు ‘మినహాయింపు’

 

ఈనాడు, అమరావతి: ఓపెన్‌ కేటగిరి కింద ప్రకటించిన పోస్టులకు  వయోపరిమితిపరంగా వెసులుబాటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, పీహెచ్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు గురువారం ప్రకటన జారీ చేశారు. ఇందుకు అవసరమైన సవరణ ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. జనరల్‌ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 47 ఏళ్లను వయోపరిమితిగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఇటీవల ఏపీపీఎస్సీ జారీ చేసిన పలు నోటిఫికేషన్లలో వయోపరిమితిలో వెసులుబాటు పొందినవారితో ఓపెన్‌ కేటగిరి పోస్టులు భర్తీ చేయడంపై అభ్యర్థులనుంచి సందేహాలు వ్యక్తమయ్యాయి. వారి విజ్ఞప్తులను పరిశీలించిన ఏపీపీఎస్సీ మెరిట్‌ ప్రాతిపదికన వయోపరిమితిలో వెసులుబాటు పొందినవారితోనూ ఓపెన్‌కేటగిరి పోస్టులుభర్తీ చేస్తామని వివరణ ఇచ్చింది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

* ఆపత్కాలంలో.. ఆరోగ్య‌సేవ‌లో..

* అవుతారా... సిస్టర్‌?    

అవుతారా.. అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి?

యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీలో 251 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

 

Posted Date : 16-10-2021