• facebook
  • whatsapp
  • telegram

Career Guidance: ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కెరియ‌ర్ గైడెన్స్‌ శిక్షణ కొనసాగింపు

ఈనాడు, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కెరియ‌ర్‌ గైడెన్స్‌ శిక్షణను మున్ముందు కొనసాగిస్తామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యూరిటీ స్టడీస్‌ (సీహెచ్‌ఎస్‌ఎస్‌), ఏపీఎస్‌ఆర్టీసీ సంయుక్తంగా ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల్లో ఇంటర్‌ నుంచి పీజీ చదివే వారికి ఎడ్యుకేట్, ఎంపవర్, ఎక్స్‌పాండ్‌ (ఈ-3) పేరిట నెల రోజుల పాటు ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని అక్టోబరు 25న విజయవాడలోని బస్‌భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఇలాంటి కోర్సులు ఉద్యోగుల పిల్లలు ఉన్నతస్థానాలకు చేరేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.

 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ బెల్‌, చెన్నైలో 73 అప్రెంటిస్‌ ఖాళీలు

‣ యూపీఎస్సీ - 64 పోస్టులు

‣ ఏసియాటిక్‌ సొసైటీలో వివిధ ఖాళీలు

‣ బుల్లి విహంగాలకు కొత్త రెక్కలు

‣ కళ్లకు కాంతి... కొలువుకు వెలుగు! 

Posted Date : 26-10-2021