* జులై 13 నాటికి పదో తరగతి, జులై 15 కన్నా ముందే 12వ తరగతి ఫలితాలు వెలువడే అవకాశం
దిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) టర్మ్-2 పదో తరగతి ఫలితాలు జులై 4 విడుదల చేయడం లేదని అధికారిక వర్గాలు స్పష్టంచేశాయి. సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు (CBSE 10th Result) విడుదల చేసే తేదీని బోర్డు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. కొన్ని సామాజిక మాధ్యమాల్లో మాత్రం జులై 4న ఫలితాలు అంటూ ప్రచారం జరిగింది. దీంతో 4వ తేదీన ఫలితాలు ప్రకటించడంలేదని సీబీఎస్ఈ కంట్రోలర్ కార్యాలయ అధికారులు చెప్పినట్టు ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, జులై 13 నాటికి పదో తరగతి ఫలితాలు, జులై 15 కన్నా ముందే 12వ తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా దాదాపు 35లక్షల మంది విద్యార్థులు పది, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా? అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు జరగ్గా.. 12వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 15వరకు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలను cbseresults.nic.in, results.gov.inవెబ్సైట్లతో పాటు డిజీలాకర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు తెలుసుకొనేందుకు విద్యార్థుల రోల్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ, పాఠశాల కోడ్ వంటి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఫెయిల్ అయ్యారా... ఏం పర్లేదు!
‣ ఇంటర్లో ఏ గ్రూప్‌ను ఎంచుకోవాలి?
‣ మారిన పరిస్థితుల కోసం మరో వ్యూహం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.