• facebook
  • whatsapp
  • telegram

Contract Lecturers: ఒప్పంద అధ్యాపకుల్ని సర్దుబాటు చేయాలి

ఈనాడు డిజిటల్, అమరావతి: జూనియర్‌ కళాశాలల్లో రెగ్యులర్‌ అధ్యాపకుల బదిలీల కారణంగా సుమారు 1,100 మంది పోస్టులు కోల్పోయామని, తమను తక్షణమే సర్దుబాటు చేయాలని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఒప్పంద అధ్యాపకులు డిమాండ్‌ చేశారు. తమ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా గ్యాప్‌Ã పీరియడ్‌(పోస్టింగ్‌ ఇవ్వని సమయం)లో వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని ఇంటర్‌ విద్య కమిషనర్‌ను కోరారు.  
పదేళ్లయినా అక్కడే కొనసాగుతున్నారు
కడప రీజియన్‌లో ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘాల కార్యవర్గ సభ్యులు బదిలీల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపులు పొందుతున్నారని లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. జీవో నంబరు 237 ప్రకారం ఏ సంఘం నాయకుడైనా ఆరు సంవత్సరాలకు మించి ఒకేచోట పనిచేయకూడదని స్పష్టంగా ఉన్నా.. పదేళ్లుగా కొనసాగుతున్నారని, ఇది అన్యాయమని పేర్కొన్నారు.

Posted Date : 25-10-2021