• facebook
  • whatsapp
  • telegram

DSEU ఫెసిలిటీస్ అండ్ హైజీన్ మేనేజ్‌మెంట్ కోర్సు

భార‌త‌దేశంలో మొద‌టిసారిగా ప్రారంభం

ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ (డీఎస్ఈయూ) 'ఫెసిలిటీస్ అండ్ హైజీన్ మేనేజ్‌మెంట్' కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సుకు సంబంధించి రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్ సంస్థ జేఎల్ఎల్ తో కీల‌క ఒప్పందం కుదుర్చుకుంది. జేఎల్ఎల్ అనేది రియల్ ఎస్టేట్, వాణిజ్యం, నివాసం, పారిశ్రామిక, రిటైల్, గిడ్డంగి, లాజిస్టిక్స్, ఆతిథ్యం, ఆరోగ్య సంరక్షణ, సీనియర్ లివింగ్, డేటా సెంటర్, విద్య, పెట్టుబడి నిర్వహణలో నైపుణ్యం కలిగిన ప్రముఖ ప్రొఫెషనల్ సేవల సంస్థ.
‣ భార‌తదేశంలో మొద‌టిసారిగా ఈ కోర్సును ప్ర‌వేశ‌పెట్టారు. 'ఫెసిలిటీస్ అండ్ హైజీన్ మేనేజ్‌మెంట్' కోర్సులో పాఠ్యాంశాలను రూపొందించడంలో కీలక భాగస్వామిగా జేఎల్ఎల్ వ్య‌వహ‌రిస్తుంది. ఈ కోర్సులో జాబ్ ట్రైనింగ్‌కి సంబంధించిన నిపుణ‌త‌ను కూడా జేఎల్ఎల్ అందిస్తుంది. అలాగే గ్రాడ్యుయేట్లకు ప్లేస్‌మెంట్‌లను క‌ల్పించ‌నుంది.

 

కోర్సు పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి..

Posted Date : 22-09-2021