• facebook
  • whatsapp
  • telegram

ఈఏపీసెట్‌లో ఇంట‌ర్ వెయిటేజీ తొల‌గింపు

 

ఈనాడు, అమరావతి: ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌)లో ఇంటర్మీడియట్‌ వెయిటేజీని తొలగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటివరకు రాత పరీక్షకు 75శాతం, ఇంటర్‌ మార్కులకు 25శాతం వెయిటేజీ ఇస్తున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసినందున 2021-22 సంవత్సరానికి వెయిటేజీని తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కులనే వంద శాతంగా తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. కొవిడ్‌-19 వల్ల విద్యా సంవత్సరం ఆలస్యం కావడంతో రెండో ఏడాదికి 30శాతం పాఠ్యప్రణాళిక తగ్గించారు. ఈ మేరకు ప్రవేశ పరీక్షలోనూ ఆ పాఠాలనుంచి ప్రశ్నలు ఇవ్వరు. ప్రస్తుతం రెండో ఏడాది ఉత్తీర్ణులైన విద్యార్థులకు గతేడాది ప్రథమ సంవత్సరం పాఠ్యాంశాలు పూర్తిగా బోధించినందున వీటిల్లో నుంచి ప్రశ్నలు స్వల్పంగా పెరుగుతాయి.

Posted Date : 27-07-2021