• facebook
  • whatsapp
  • telegram

CTET: డిసెంబర్‌ 16, జనవరి 13 మధ్య సీటెట్‌ 

 

దిల్లీ: కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్‌) డిసెంబర్‌ 16, జనవరి 13 మధ్య జరగనుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహించే కేంద్రీయ మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) ఒక ప్రకటన విడుదల చేసింది. కంప్యూటర్‌ ఆధారితంగా జరిగే ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 20 భాషల్లో నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది. పరీక్ష వివరాలు, సిలబస్, భాషలు, అర్హత ప్రమాణాలు, పరీక్ష రుసుం, పరీక్షా నగరాలు, ముఖ్యమైన తేదీలతో కూడిన సమాచారం.. సీటెట్‌ వెబ్‌సైట్‌లో సెప్టెంబర్‌ 20 నుంచి అందుబాటులోకి రానుంది. సీటెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్‌ 20న ప్రారంభమై అక్టోబర్‌ 19న ముగియనుంది. ఫీజు అక్టోబర్‌ 20 మధ్యాహ్నం 3.30 గంటల్లోపు చెల్లించాలి.  

Posted Date : 18-09-2021