• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌ ప్రాథమిక కీ విడుదల

 

ఈనాడు, హైదరాబాద్‌: ఎట్టకేలకు జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) నీట్‌ ప్రాథమిక కీని అక్టోబర్ 15న విడుదల చేసింది. పరీక్ష జరిగిన నెలరోజుల తర్వాత కీ విడుదల చేయడంతో లక్షల మంది అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్ 17వ తేదీ రాత్రి 9 గంటలలోపు కీపై అభ్యంతరాలుంటే వెబ్‌సైట్‌ ద్వారా పంపొచ్చు. అభ్యంతరాలను పరిశీలించాక ఫలితాలు వెల్లడిస్తారు. వారం పది రోజుల్లో ర్యాంకులను వెల్లడించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 

Posted Date : 17-10-2021