• facebook
  • whatsapp
  • telegram

Ola Cars: ఓలా కార్స్‌లో 10,000 ఉద్యోగాలు

దిల్లీ: వాహనాలను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు నెలకొల్పిన కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఓలా కార్స్‌ సేవలను 100 నగరాలకు విస్తరిస్తామని, ఇందుకోసం వచ్చే 12 నెలల్లో 10,000 మంది ఉద్యోగుల్ని నియమించుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.15,000 కోట్లు) స్థూల వ్యాపార విలువ సాధించి, మార్కెట్‌లో నాయకత్వ స్థానం సాధించేందుకు అడుగులు వేస్తున్నట్లు పేర్కొంది. ఓలా యాప్‌లో కొత్త, పాత (ప్రీ-ఓన్డ్‌) వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోగదార్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇప్పటికే సంస్థ పేర్కొంది. వచ్చే ఏడాదికి ఈ ప్లాట్‌ఫామ్‌ను 100 నగరాలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే 5,000 వినియోగ వాహనాలను విక్రయించినట్లు వెల్లడించింది. ఈ పండగల సీజన్‌లో హైదరాబాద్, దిల్లీ, ముంబయి, పుణె, చెన్నై, అహ్మదాబాద్‌లలో విక్రయాలు జరిపామని తెలిపింది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఐఓసీఎల్‌ - 469 అప్రెంటిస్‌ ఖాళీలు

‣ దిల్లీ పోస్టల్‌ సర్కిల్‌లో 221 పోస్టులు

‣ లక్ష్య సాధనకు దివిటీ! 

‣ ఏ పుస్తకాలు.. ఎంత మేలు?

‣ కళ్లకు కాంతి... కొలువుకు వెలుగు!

Posted Date : 22-10-2021