• facebook
  • whatsapp
  • telegram

Latest News: 02-07-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. TS Gvt Jobs: ఇంజినీరింగ్‌ శాఖల్లో 1927 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం 

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల, రహదారులు-భవనాలు, పంచాయతీరాజ్, ప్రజారోగ్యశాఖ, భగీరథ, భూగర్భ జలవనరుల శాఖల్లో 1927 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. BRAOU: అంబేడ్కర్‌ వర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు ప్రకటన 

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2022-23 సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు వర్సిటీ వర్గాలు జులై 1న ఓ ప్రకటనలో తెలిపాయి. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ..

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Agnipath: ఆర్మీ, నేవీలో అగ్నిపథ్‌ నియామకాలు ప్రారంభం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకం కింద భారత సైన్యం, వాయుసేన విభాగాల్లో నియామకాలు మొదలైనట్లు రక్షణ మంత్రిత్వశాఖ జులై 1న వెల్లడించింది. భారత వాయుసేన జూన్‌ 24నే ఈ నియామక ప్రక్రియను పారంభించగా, ఇప్పటిదాకా 2.72 లక్షల దరఖాస్తులు అందినట్లు తెలిపింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Medical Posts: 2,588 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లోని అవసరాలకు వివిధ రకాల 2,588 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో కొత్తగా సృష్టించిన పోస్టులు కూడా ఉన్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. TRT: టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఎప్పుడు?

ఈనాడు, హైదరాబాద్‌: సర్కారు బడుల్లో ఉపాధ్యాయ ఖాళీలను నింపుతామని మార్చిలో ప్రకటించిన ప్రభుత్వం నేటికీ ఆమోదం తెలపలేదు. ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ను నిర్వహించిన సర్కారు శుక్రవారం వాటి ఫలితాలను వెల్లడించింది. తర్వాతి ప్రక్రియ టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు(టీఆర్‌టీ) గురించి ఏమీ ప్రకటించలేదు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.