• facebook
  • whatsapp
  • telegram

Group-IV: గ్రూప్ - 4 ఏయే శాఖ‌ల్లో ఎన్ని పోస్టులు?  

* 9168 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి

* త్వ‌ర‌లో నోటిఫికేష‌న్‌

ఈనాడు - హైదరాబాద్‌: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వేలమంది నిరుద్యోగులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా వీటిని భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆర్థికశాఖ న‌వంబ‌రు 25న‌ ఉత్తర్వులు జారీ చేసింది. 25 శాఖల్లోని 91 విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,859 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు పురపాలక శాఖలో 1,862 వార్డు అధికారుల పోస్టులు, ఆర్థికశాఖ, పురపాలకశాఖలో 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, ఆడిట్‌శాఖలో 18 మంది జూనియర్‌ ఆడిటర్ల నియామకానికి ఆర్థికశాఖ అనుమతించింది. సదరు ఉద్యోగాల భర్తీకి వీలుగా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు న‌వంబ‌రు 25న‌ ఉత్తర్వులు జారీ చేశారు.  జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి వీలుగా సంబంధిత శాఖలు ఖాళీల వివరాలు, అర్హతలు, రోస్టర్‌ పాయింట్లు, లోకల్‌ క్యాడర్‌ వంటి వివరాలను టీఎస్‌పీఎస్సీకి అందించాలని సూచించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆర్థికశాఖ ఉత్తర్వులను మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లోపెట్టి ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వారి ఆకాంక్షలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నెరవేరుస్తున్నారు. ప్రజల సేవే లక్ష్యంగా సీఎం భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి అనుమతించి ఖాళీలను భర్తీ చేస్తున్నారు’’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 9168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆర్థికశాఖ ఉత్తర్వులను మంత్రి ట్విటర్‌లోపెట్టి ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

టీఎస్‌పీఎస్సీ > గ్రూప్‌-4 > స్టడీమెటీరియల్ 

‣ జనరల్ స్టడీస్

‣ సెక్రటేరియల్ ఎబిలిటీస్

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆఫీసర్‌ కొలువుకు నౌకాదళం పిలుపు!

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!

‣ అమ్మకాల దళంలో చేరతారా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.