ఈనాడు, అమరావతి: పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు.. ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వరకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాకపోకలు సాగించేందుకు వీలుకల్పిస్తూ యాజమాన్యం మార్చి 23న ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు 3,348 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు 6.64 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. హాల్‌టికెట్‌ను చూపించి పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో వీరు ప్రయాణించొచ్చని, పరీక్షలు జరిగినన్ని రోజులూ ఈ వెసులుబాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో సంప్రదించి అవసరమైన మేరకు బస్సులు నడపాలని జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారులను ఈడీ (ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి ఆదేశించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!
‣ గ్రూప్-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?
‣ రివిజన్..ప్రాక్టీస్.. సక్సెస్ సూత్రాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.