* నియామకాలు సింగిల్ జడ్జి తీర్పునకు లోబడి ఉంటాయి
* కట్టుబడి ఉంటామని ఎంపికైన అభ్యర్థుల నుంచి హామీ తీసుకోండి
* జవాబు పత్రాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచండి
* ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం
ఈనాడు, అమరావతి: గ్రూప్-1 ప్రధాన పరీక్షలో ఎంపికైన వారికి ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని ఏపీపీఎస్సీకి హైకోర్టు ధర్మాసనం అనుమతిచ్చింది. నియామకాలు సింగిల్ జడ్జి తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చిచెప్పింది. ఫలితాల ప్రకటన, పోస్టింగు ఉత్తర్వులు ఇస్తే.. అవి సింగిల్ జడ్జి తీర్పునకు లోబడి ఉంటాయనే విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించాలంది. ఎంపికైన అభ్యర్థుల నుంచి కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని, ఎంపికైన నేపథ్యంలో హక్కులను కోరబోమంటూ హామీ తీసుకోవాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థులు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా చేరాలనుకుంటే అనుమతిస్తామని తెలిపింది. ఆ వ్యాజ్యాల్లో జులై మొదటివారంలో కౌంటరు వేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. వాయిదాలు కోరకుండా జులై 14న ఇరుపక్షాలు వాదనలు వినిపిస్తాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. గ్రూప్-1 ప్రధాన పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులందరి జవాబుపత్రాలను భద్రపరచాలని ఏపీపీఎస్సీకి స్పష్టంచేసింది. డిజిటల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల జవాబు పత్రాలతో పాటు మాన్యువల్ విధానంలో వారు సాధించిన మార్కుల వివరాలను సీల్డ్కవర్లో రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) వద్ద ఉంచాలని స్పష్టంచేసింది. అలాగే మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేసినప్పుడు ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల జవాబుపత్రాలను హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ వద్ద ఉంచాలంది. రిట్ అప్పీళ్లను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఇంటర్వ్యూలు జూన్ 29తో ముగిశాక ఫలితాలను ప్రభుత్వానికి పంపేందుకు 7 నుంచి 9 రోజులు, అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేందుకు మరో 4 నుంచి 6 వారాలు పడుతుందని ఏపీపీఎస్సీ చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. సింగిల్ జడ్జి వద్ద జులై 14న తుది విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం తాము ఇచ్చిన ఉత్తర్వులు ఇరుపక్షాల ప్రయోజనాలను కాపాడతాయని తీర్పులో పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం జూన్ 24నఈ మేరకు తీర్పు ఇచ్చింది.
* గ్రూప్-1 జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇంటర్వ్యూలను నిలుపుదల చేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. గ్రూప్-1 పోస్టుల ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియ కొనసాగించుకోవచ్చని, తుది ఎంపిక ఫలితాలు న్యాయస్థానం ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని ఇటీవల సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వాటిని సవాలుచేస్తూ అభ్యర్థులు కొందరు ధర్మాసనం ముందు అప్పీళ్లు వేశారు. ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. నిర్ణయాన్నిజూన్ 24న వెల్లడించింది.
*********************************************************************************
‣ సెక్షన్-ఎ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు
2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
4. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర
6. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఆర్థికాభివృద్ధి
7. ఆంధ్రప్రదేశ్, భారత ఉపఖండం యొక్క భౌతిక భూగోళశాస్త్రం
9. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ
10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్
‣ సెక్షన్-బి: జనరల్ ఇంగ్లిష్, తెలుగు
d) Logical re-arrangement of sentences
సి) తెలుగు పదాలకు ఇంగ్లిష్ అర్థాలు
డి) ఇంగ్లిష్ పదాలకు తెలుగు అర్థాలు
ఇ) పలుకుబడి/ వాడుక, నుడికారం/ జాతీయాలు
‣ ఈ-బుక్స్
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ గ్రూప్-1 ఇంటర్వ్యూకి ఇవిగో మెలకువలు
‣ పట్టపగ్గాల్లేని రాజకీయ ఫిరాయింపులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.