• facebook
  • whatsapp
  • telegram

ICAR AIEEA: ఐకార్ ఏఐఈఈఏ 2021 ఫలితాలు విడుదల

 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఐకార్ఏఐఈఈఏ) 2021 ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌/ పుట్టిన తేదీ వివరాలతో సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి స్కోర్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఐకార్ ఏఐఈఈఏ పరీక్ష ద్వారా వ్యవసాయం, వెటర్నరీ సైన్సెస్ ఇతర అనుబంధ శాస్త్రాల్లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు పొందవచ్చు. ఐఏఆర్ఈ, ఐవీఆర్ఐ, ఎన్డీఆర్ఐ, సీఐఎఫ్ఈ, ఆర్ఎల్‌బీసీఏయూ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఈ పరీక్ష స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్‌ పొందడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. 

 

ఐకార్ ఏఐఈఈఏ యూజీ 2021 ఫలితాలు

 


 

ఐకార్ ఏఐఈఈఏ పీజీ 2021 ఫలితాలు

 


 

ఐకార్ ఏఐఈఈఏ పీహెచ్‌డీ 2021 ఫలితాలు

 

Posted Date : 25-10-2021