• facebook
  • whatsapp
  • telegram

JCJ: జేసీజే పోస్టుల భర్తీలో బీసీలకు నష్టం కలిగించే నిబంధన కొట్టివేత

పిటిషనర్‌కు జడ్జి పోస్టు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: జూనియర్‌ సివిల్‌ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీలో బీసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు పొందాలన్న ‘2007లోని ఏపీ రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసు నిబంధన 6(ఎఫ్‌)’ను హైకోర్టు కొట్టేసింది. 2019లో జేసీజే నోటిఫికేషన్లో ఈ నిబంధన వల్ల నష్టపోయిన చిలకలూరిపేటకు చెందిన షేక్‌ నిషద్‌నాజ్‌.. జేసీజే పోస్టు పొందేందుకు అర్హురాలని, ఆమెకు ఉద్యోగం ఇవ్వాలంటూ హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సెప్టెంబరు 23న ఈ తీర్పు ఇచ్చింది. జేసీజే పోస్టుల భర్తీలో ఓసీ అభ్యర్థులతో సమానంగా బీసీ అభ్యర్థులు రాతపరీక్ష, ఇంటర్వ్యూతో కలిపి 210 మార్కులు సాధించాలన్న నిబంధన 6(ఎఫ్‌)ను సవాలుచేస్తూ నిషద్‌నాజ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫు న్యాయవాది బాలాజీ వడేరా వాదనలు వినిపిస్తూ ‘ఈ నిబంధన బీసీ అభ్యర్థుల పట్ల వివక్ష చూపేదిగా ఉంది. హైకోర్టు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఓసీలు రాతపరీక్షలో 300 మార్కులకు 180, ఇంటర్వ్యూలో 50 మార్కులకు 30.. మొత్తంగా కనీసం 210 మార్కులు సాధించాల్సి ఉంది. బీసీ అభ్యర్థులు రాతపరీక్షలో 165, ఇంటర్వ్యూలో 45 (90 శాతం) మొత్తంగా 210 మార్కులు పొందాల్సి ఉంది. ఇంటర్వ్యూలో బీసీలు 90శాతం, ఓసీలకు 60శాతం నిర్దేశించడం అన్యాయం. రాతపరీక్షలో వెసులుబాటు ఇస్తూ.. ఇంటర్వ్యూలో మెలిక పెట్టడం సరికాదు’ అని వాదించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఇంటర్‌తో ఐటీ ఉద్యోగం!

‘నో’ చెప్పలేకపోతున్నారా? 

Posted Date : 24-09-2021