• facebook
  • whatsapp
  • telegram

Junior Lecturers: జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలి: ఎన్‌టీఏ 

ఈనాడు, అమరావతి: స్కూల్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని నవ్యాంధ్ర ఉపాధ్యాయ సంఘం(ఎన్‌టీఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు కోరారు. గత కొన్నేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో 40% జూనియర్‌ లెక్చరర్ల పదోన్నతులను ఉపాధ్యాయులు కోల్పోయారని వెల్లడించారు. పదోన్నతులతోనే జూనియర్‌ లెక్చరర్ల కొరత తీరుతుందని గుర్తుచేశారు.

Posted Date : 28-10-2021