• facebook
  • whatsapp
  • telegram

KU Distance Exams: రేపటి నుంచి కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు

ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధి దూరవిద్య డిగ్రీ ప్రథమ, రెండో సంవత్సరం, పీజీ మెదటి సంవత్సరం పరీక్షలు అక్టోబరు 26 నుంచి ప్రారంభమవుతాయని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారులు డా.వై.వెంకయ్య, డా.పి.సదానందం అక్టోబరు 24న తెలిపారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 17,706, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 8,443 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. పీజీ మొదటి సంవత్సరం పరీక్షలకు 6,169 మంది నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్లను సంబంధిత అధ్యయన కేంద్రాల నుంచి తీసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం కేయూ కూడలిలోని దూరవిద్య కేంద్రంలో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ టీఎంసీ, యాక్ట్రెక్‌లో వివిధ ఖాళీలు

‣ యూపీఎస్సీ - 64 పోస్టులు 

‣ కళ్లకు కాంతి... కొలువుకు వెలుగు! 

‣ అవుతారా... సిస్టర్‌? 

‣ పచ్చదనానికి గొడ్డలిపెట్టు

Posted Date : 25-10-2021