• facebook
  • whatsapp
  • telegram

KU PG Exams: కేయూ ఐదేళ్ల పీజీ కోర్సుల్లో సెప్టెంబరు 22 నుంచి పరీక్షలు 

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం అందిస్తున్న పీజీ ఐదేళ్ల కోర్సుల్లో సెప్టెంబరు 22వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్‌ ఎం.సురేఖ సెప్టెంబరు 17న పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎమ్మెస్సీ ఐదేళ్ల రసాయనశాస్త్రం, బయోటెక్నాలజీ ప్రథమ సెమిస్టర్‌ విద్యార్థులకు సెప్టెంబరు 22, 23, 24, 25, 27, 28, 29, 30వ తేదీ వరకు వరుసగా పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఐదేళ్ల బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ మూడో సెమిస్టర్‌ వారికి సెప్టెంబరు 22, 23, 24, 25, 27, 28, 29 తేదీల్లో పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామన్నారు.

Posted Date : 18-09-2021