• facebook
  • whatsapp
  • telegram

12-06-2021 లేటెస్ట్ కరెంట్‌ అఫైర్స్‌ 

1. బ్రిటన్‌లో జంతువుల టీకా అభివృద్ధి కేంద్రం 

భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులకు వైరస్‌లు వ్యాప్తి చెందకుండా కళ్లెం వేసే చర్యల్లో భాగంగా బ్రిటన్‌లో ‘జంతువుల టీకా అభివృద్ధి కేంద్రం’ ఏర్పాటు కానుంది. భవిష్యత్తులో ఎప్పుడు కొత్త రకం వైరస్‌ బయటపడినా దానిని కీలకమైన తొలి 100 రోజుల్లోనే నియంత్రించగలిగేలా వివిధ రకాల చర్యలు చేపట్టాలని జి-7 దేశాలు నిర్ణయించాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ వైద్య కేంద్రాలుగా ఎస్‌హెచ్‌సీ, పీహెచ్‌సీలు

దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మొత్తం 1.50 లక్షల ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ‘ఆయుష్మాన్‌ భారత్‌ - హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు (ఏబీ-హెచ్‌డబ్ల్యూసీలు)’గా మార్పు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ భారతంలో కొవిడ్‌ను సమర్థంగా కట్టడి చేసే దిశగా ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. జి-7 దేశాలకు ప్రధాని మోదీ పిలుపు

కరోనా సంబంధిత సాంకేతికతలకు ‘మేధో సంపత్తి హక్కుల పరమైన వాణిజ్య అంశాలను’ (ట్రిప్స్‌ను) రద్దు చేయాలని ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ వద్ద భారత్, దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని జి-7 దేశాల కూటమికి ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. బ్రిటన్‌లో జరుగుతున్న జి-7 దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘ఒకే ధరిత్రి.. ఒకే ఆరోగ్యం’ అనే దృక్పథంతో కలిసికట్టుగా ముందడుగు వేసి కరోనాను సమర్థంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు యావత్‌ ప్రపంచానికి సందేశం పంపాలని మోదీ చెప్పారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. మేఘా రాజగోపాలన్‌, నీల్‌ బేడికి పులిట్జర్‌ పురస్కారం

భారత సంతతికి చెందిన ఇద్దరు సాహసోపేత పాత్రికేయులను ప్రతిష్ఠాత్మక పులిట్జర్‌ పురస్కారం వరించింది. చైనాలోని కల్లోలిత షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ప్రభుత్వ దురాగతాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చిన ‘బజ్‌ఫీడ్‌ న్యూస్‌’ జర్నలిస్టు మేఘా రాజగోపాలన్‌ ‘అంతర్జాతీయ రిపోర్టింగ్‌’ విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ‘తంపా బే టైమ్స్‌’ పాత్రికేయుడు నీల్‌ బేడికీ ఈ పురస్కారం లభించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. భారత్‌ బ్రహ్మాస్త్రానికి 20 ఏళ్లు

బ్రహ్మోస్‌ తొలి ప్రయోగ పరీక్ష చేపట్టి 20 ఏళ్లు పూర్తయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్‌ క్షిపణిగా గుర్తింపు పొందింది. వందల పరీక్షల అనంతరం సైన్యం, నౌకాదళం, వాయుసేనలో మోహరించిన క్షిపణులతో భారత అమ్ముల పొదిలో బ్రహ్మోస్‌ కీలక అస్త్రంగా మారింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

6. దేశంలోని అత్యంత విలువైన అంకుర సంస్థగా బైజూస్‌

దేశంలోని అత్యంత విలువైన అంకుర సంస్థగా బైజూస్‌ అవతరించింది. తాజాగా వివిధ సంస్థలు/ పెట్టుబడిదార్లు రూ.2,500 కోట్ల (340 మిలియన్‌ డాలర్లు) మేర పెట్టుబడులు పెట్టడంతో బైజూస్‌ విలువ సుమారు 16.5 బిలియన్‌ డాలర్లకు చేరింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

7. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మ‌హిళ‌ల విజేత క్రెజికోవా

టెన్నిస్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేతగా చెక్‌ రిపబ్లిక్‌ అమ్మాయి బార్బారా క్రెజికోవా (25) నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో 6-1, 2-6, 6-4తో 31వ సీడ్‌ అనస్తేసియా పవ్లిచెంకోవా (రష్యా)ను ఓడించి కెరీర్‌లో ఘనంగా తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌

Posted Date : 13-06-2021