• facebook
  • whatsapp
  • telegram

Latest News: 24-09-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Gitam Versity: ‘గీతం’ దూరవిద్యపై యూజీసీ నిషేధం

ఈనాడు, హైదరాబాద్‌: గీతం విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) నిర్ణయం తీసుకుంది. దూరవిద్య కోర్సుల నిర్వహణ విషయంలో నిబంధనలు పాటించడం లేదంటూ ప్రవేశాలు తీసుకోవడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Tuition Fee: 67 శాతం మందికి బోధనా రుసుం

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ తొలి విడతలో బీటెక్‌ సీట్లు పొందినవారిలో 67 శాతం మంది బోధనా రుసుం పొందనున్నారు. కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటాలో చేరిన వారికి మాత్రమే ప్రభుత్వం బోధనా రుసుం చెల్లిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి వార్షిక కుటుంబ ఆదాయం రూ.లక్షన్నరలోపు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలలోపు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Engineers: న్యాయవిద్య వైపు ఇంజినీర్ల మొగ్గు

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులు న్యాయ విద్యలోనూ ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో చేరేందుకు నిర్వహించిన లాసెట్‌లో 2,861 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇటీవల లాసెట్‌ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసారి 29,629 మంది పరీక్ష రాయగా వారిలో 20,398 మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. KU: 25 నుంచి  ఎంఎస్‌డబ్ల్యూ తరగతులు

నయీంనగర్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రం నిర్వహిస్తున్న ఎంఎస్‌డబ్ల్యూ ఆఖరు సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబరు 25 నుంచి కాంట్రాక్ట్‌ తరగతులు జరుగుతాయని

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. NITW: 9న వరంగల్‌ నిట్‌ స్నాతకోత్సవం

ఎన్‌ఐటీ క్యాంపస్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ(ఎన్‌ఐటీ) 19వ స్నాతకోత్సవం అక్టోబరు 9న వర్చువల్‌ విధానంలో జరుగనుంది. ఈ వేడుకకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ముఖ్య అతిథిగా, జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీˆ) డ్రాఫ్ట్‌ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ కె.కస్తూరిరంగన్‌ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 
 

Posted Date : 24-09-2021