1. Staff Nurse Posts: 957 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 957 స్టాఫ్ నర్సుల పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సవరించిన నోటిఫికేషన్ను జారీ చేసింది. గత వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని అవసరాల మేరకు 461 స్టాఫ్ నర్సు పోస్టుల ఖాళీల భర్తీకి ఓ నోటిఫికేషన్ వెలువడిన విషయం విదితమే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. FSO Exam: ఎఫ్ఎస్వో రాత పరీక్షలో 4 ప్రశ్నల తొలగింపు
ఈనాడు, హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఆహార భద్రతా అధికారుల (ఎఫ్ఎస్వో) పోస్టులకు నవంబరు 7న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తుది ‘కీ’ని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు కమిషన్..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. PG Admissions: పీజీ కోర్సుల ప్రవేశాల్లో అమ్మాయిలదే హవా
ఈనాడు, హైదరాబాద్: ఉన్నత విద్యలో మొన్నటివరకు అబ్బాయిలదే హవా. తద్భిన్నంగా ప్రస్తుతం రాష్ట్రంలోని వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో చేరే అమ్మాయిల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్నేళ్లుగా అబ్బాయిల సంఖ్యతో పోల్చితే అది రెండింతలు అవుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Tutors: నర్సింగ్ కళాశాలల్లో ‘ట్యూటర్ల’ కోసం కౌన్సెలింగ్!
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ (బీఎస్సీ) కళాశాలల్లో ట్యూటర్లను తాత్కాలిక సర్దుబాటులో భాగంగా నియమించనున్నారు. శాశ్వత ప్రాతిపాదికన పోస్టుల భర్తీ వ్యవహారం కోర్టులో ఉన్నందున అర్హత కలిగిన స్టాఫ్ నర్సులను ట్యూటర్లగా జోనల్ ప్రతిపాదికన కౌన్సెలింగ్ ద్వారా నియమిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. IRMS Exam: యూపీఎస్సీ ద్వారా ఐఆర్ఎంఎస్ పరీక్ష
ఈనాడు, దిల్లీ, హైదరాబాద్: ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్) పరీక్షను 2023 నుంచి యూపీఎస్సీ ద్వారా నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ డిసెంబరు 2న ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్ (30), మెకానికల్ (30), ఎలక్ట్రికల్ (60), కామర్స్ అండ్ అకౌంటెన్సీ (30) విభాగాలకు చెందిన మొత్తం 150 పోస్టులకు ఐఆర్ఎంఎస్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే యూపీఎస్సీని కోరినట్లు పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.