• facebook
  • whatsapp
  • telegram

Latst News: 28-08-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Engineering Classes: సెప్టెంబ‌రు 6 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ పరిధిలో ఇంజినీరింగ్‌, బీఫార్మసీ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకు సెప్టెంబ‌రు 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆయా సంవత్సరాల మొదటి, రెండో సెమిస్టర్ల షెడ్యూల్‌ను వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ ఆగ‌స్టు 27న‌ ప్రకటించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. AP TENTH: 2020, 2021 ప‌దో త‌ర‌గ‌తుల‌కు సంబంధించి ప్ర‌భుత్వ నిర్ణ‌యం

* గ్రేడ్ల స్థానంలో మార్కుల కేటాయింపు

* ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం ప్రస్తుత విధానం రద్దు

ఈనాడు, అమరావతి: పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్‌ ఆగ‌స్టు 27న‌ ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్‌ విధానానికి స్వస్తి పలికారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. KU Exams: సెప్టెంబరు 6 నుంచి ఎంబీఏ పరీక్షలు

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కేయూ రెగ్యులర్‌ ఎంబీఏ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబరు 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్‌ ఎం.సురేఖ ఆగస్టు 27న ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. PH.D RCET: పీహెచ్‌డీ ప్రవేశాలకు ఆర్‌సెట్‌

ఈనాడు, అమరావతి: పరిశోధన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఆర్‌సెట్‌) ద్వారా పీహెచ్‌డీ ప్రవేశాలు నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులనిచ్చింది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నెట్, సీఎస్‌ఐఆర్, ఎంఫిల్‌ అర్హత ఉన్నవారికి ఒకే ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. AP Engineering: సెప్టెంబరు 14 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్‌ను సెప్టెంబరు 14 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయించింది. మొదట ఇంజినీరింగ్, ఆ తర్వాత వ్యవసాయ కోర్సులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 
 

Posted Date : 28-08-2021