• facebook
  • whatsapp
  • telegram

LAWCET: లాసెట్‌లో 68.84 శాతం ఉత్తీర్ణత  

ఈనాడు, హైదరాబాద్‌: లాసెట్‌ రాసిన వారిలో 68.84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 39,805 మంది దరఖాస్తు చేసుకోగా 29,629 మంది పరీక్ష రాశారు. వారిలో 20,398 మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సెప్టెంబ‌రు 15న‌ ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్‌, లాసెట్‌ కన్వీనర్‌ జీబీరెడ్డి, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ గత మూడేళ్లుగా లాసెట్‌ రాసే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. కన్వీనర్‌ జీవీ రెడ్డి మాట్లాడుతూ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం కోసం కళాశాలలకు సంబంధించిన వివరాలను పంపామని, ఆమోదం వచ్చిన తర్వాత కౌన్సెలింగ్‌ మొదలవుతుందన్నారు. బీటెక్‌ విద్యార్థులు, ఎంబీబీఎస్‌ పూర్తయినవారూ లాసెట్‌ రాశారని తెలిపారు.

ప్రథమ ర్యాంకర్లు వీరే

* ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సులో చంచలగూడకు చెందిన గణేష్‌ శాస్త్రశరణ్‌, అయిదేళ్ల కోర్సులో మల్కాజిగిరికి చెందిన డి.శ్రీధర్‌రెడ్డి, ఎల్‌ఎల్‌ఎం(పీజీఎల్‌సెట్‌)లో ఉప్పల్‌కు చెందిన బి.దీక్ష ప్రథమ ర్యాంకులు సాధించారు.

 

మ‌రింత స‌మాచారం... మీకోసం!

సామాజిక హోదాను అందిస్తుంది'లా'!

 

Posted Date : 16-09-2021