• facebook
  • whatsapp
  • telegram

వైద్య ప‌రీక్ష‌ల షెడ్యూలు ప్ర‌క‌ట‌న‌

దేశంలో వివిధ వైద్య ప‌రీక్ష‌ల షెడ్యూలును నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ ఇన్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్‌) విడుద‌ల చేసింది. జులై 2021 నుంచి మార్చి 2022 వ‌ర‌కు నిర్వ‌హించే ప‌రీక్ష‌ల తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఈమేర‌కు నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ ఫ‌ర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్‌-పీజీ)-2021 ప‌రీక్ష‌ను సెప్టెంబ‌ర్ 11న‌ నిర్వ‌హించ‌నుంది. అలాగే నీట్ సూప‌ర్ స్పెషాలిటీ(ఎస్ఎస్‌)-2021 న‌వంబ‌ర్ 13, 14 తేదీల్లో జ‌రుగుతుంది. నీట్ ఎండీఎస్‌-2022 డిసెంబ‌ర్ 19న నిర్వ‌హిస్తారు. ఫారెన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేష‌న్ (ఎఫ్ఎంజీఈ) డిసెంబ‌ర్ సెష‌న్‌, ఫారెన్ స్ర్కీనింగ్ టెస్ట్‌-2021 రెండు ప‌రీక్ష‌లూ డిసెంబ‌ర్ 12న జ‌రుగుతాయి. ఫెల్లోషిప్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఎఫ్ఈటీ)-2021 న‌వంబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. 

వెబ్‌సైట్‌: https://natboard.edu.in/