• facebook
  • whatsapp
  • telegram

Job Fair: 30న పెడనలో మెగా ఉద్యోగ మేళా

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ, సీడ్‌ ఏపీ, ఉద్యోగకల్పనా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబ‌రు 30న ఉదయం 9 గంటలకు మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజర్‌ ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. పెడన నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లోని యువతీ, యువకులకు మంత్రి జోగి రమేష్‌ సారథ్యంలో స్థానిక సెయింట్‌ విన్సెంట్‌ పల్లోటి ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఉద్యోగ మేళాలో 19 కంపెనీలు పాల్గొంటున్నట్లు వివరించారు. పదో తరగతి నుంచి ఐటీఐ, డిప్లొమో, ఇంటర్‌, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్‌, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ పాల్గొనవచ్చునని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.apssdc.in వెబ్‌సైట్లో తమ పూర్తి వివరాల్ని నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. రెజ్యూమ్‌తో పాటు ఆధార్‌, విద్యార్హత ధ్రువపత్రాల నకళ్లతో హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్‌ నంబర్‌లో 7981 368429 సంప్రదించాలని వివరించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భ‌ర్తీ

‣ ఏఈఈ కొలువుల‌కు ఎలా సిద్ధం కావాలి?

‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం

‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?

‣ స్టడీమెటీరియల్‌.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.