• facebook
  • whatsapp
  • telegram

Medical Counselling: జాతీయ కోటా వైద్య ప్రవేశాల కౌన్సెలింగ్‌ 11 నుంచి

* 17 నుంచి తెలంగాణ‌లో.. 

* షెడ్యూల్‌ విడుదల

 

ఈనాడు, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో అఖిల భారత స్థాయి సీట్లలో ప్రవేశాలకు అక్టోబ‌రు 11 నుంచి, తెలంగాణ‌ రాష్ట్రంలో సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అక్టోబ‌రు 3న‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబరు 15 నుంచి తొలి ఏడాది వైద్యవిద్య తరగతులు ప్రారంభం కావాలని సూచించింది.

 

అఖిల భారత కోటాలో..

* తొలివిడత ప్రవేశాల ప్రక్రియ: అక్టోబ‌రు 11 నుంచి 20 వరకు

* సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలల్లో

* చేరడానికి గడువు: అక్టోబ‌రు 22- 28 

* రెండో విడత ప్రవేశాలు: నవంబరు 2 - 10

* కళాశాలల్లో చేరాల్సిన గడువు: నవంబరు 12 - 18

* మాప్‌అప్‌ రౌండ్‌: నవంబరు 23 - డిసెంబరు 1 

* సీట్లు పొందిన అభ్యర్థులు చేరాల్సిన గడువు: డిసెంబరు 4-10 

* సీట్లు మిగిలితే వాటిని రాష్ట్రాలకు బదిలీ చేస్తారు

 

రాష్ట్రస్థాయిలో..

* తొలి విడత కౌన్సెలింగ్‌: అక్టోబ‌రు 17 నుంచి 28 వరకు

* విద్యార్థులు కళాశాలల్లో చేరాల్సిన గడువు: నవంబరు 4

* రెండోవిడత కౌన్సెలింగ్‌: నవంబరు 7 - 18

* విద్యార్థులు కళాశాలల్లో చేరాల్సిన గడువు: నవంబరు 21

* మాప్‌అప్‌ రౌండ్‌: డిసెంబరు 6 - 12

* సీట్లు పొందిన వారు కళాశాలల్లో చేరాల్సిన గడువు: డిసెంబరు 16

* అన్ని విడతల ప్రవేశాలను డిసెంబరు 20లోపు పూర్తి చేయాలని జాతీయ వైద్య కమిషన్‌ స్పష్టం చేసింది.
 

 

ఎంసెట్ మాక్‌ కౌన్సెలింగ్‌ - 2022

 

 ఇంజినీరింగ్‌ అగ్రిక‌ల్చ‌ర్ & ఫార్మసీ 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పోటీలో దీటుగా నిల‌వాలంటే?

‣ ఏఈఈ కొలువుల‌కు ఎలా సిద్ధం కావాలి?

‣ ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భ‌ర్తీ

‣ ఎదురుగానే జవాబు అయినా ఎంతో కష్టం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.