• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబరు 24 నుంచి ‘పీ సెట్‌’ 

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘పీ సెట్‌’ సెప్టెంబరు 24 నుంచి ప్రారంభం కానుంది. దీని నిర్వహణపై ఆగ‌స్టు 3న‌ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కన్వీనర్‌ జాన్సన్‌ ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. ఆగ‌స్టు 5న పీసెట్‌ ప్రకటన విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 5 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. రూ.500 అపరాధ రుసుంతో సెప్టెంబరు 16 వరకు ఫీజు చెల్లించవచ్చు. సెప్టెంబరు 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని,  24 నుంచి ఎంపికలు జరుగుతాయని చెప్పారు. పురుషులకు 100, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌ జంప్, హైజంప్, షాట్‌పుట్‌ అంశాలతో పాటు ఏదైనా ఒక క్రీడ, అలాగే మహిళలకు 100, 400 మీటర్ల పరుగు పందెం పోటీలు, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్‌ అంశాలతో పాటు ఏదైనా ఓ క్రీడలో నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి, పీసెట్‌ ఛైర్మన్‌ ఆచార్య రాజశేఖర్, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.

Posted Date : 04-08-2021