• facebook
  • whatsapp
  • telegram

జేఎన్టీయూ-హెచ్‌ పరిధిలో 29న జరిగే పరీక్షలు వాయిదా

 

హైదరాబాద్‌ జేఎన్టీయూ పరిధిలో సెప్టెంబరు 29న (బుధవారం) జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో 29న జరగాల్సిన ఇంజినీరింగ్‌/ఫార్మసీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ చెబుతామని, సెప్టెంబరు 30 నుంచి జరగాల్సిన పరీక్షలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని రిజిస్ట్రార్‌ స్పష్టంచేశారు.