స్పష్టం చేసిన కేంద్రం
దిల్లీ: విద్యా హక్కు చట్టం కింద ఎనిమిదో తరగతి వరకూ బాలలందరికీ తప్పనిసరిగా విద్యను అమలు చేస్తున్నందున ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ పథకానికి కేంద్రం పరిమితులు విధించింది. ఆ ప్రకారం ఓబీసీలు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన తొమ్మిది, పదో తరగతి చదివే విద్యార్థులకే ఇక ఉపకార వేతనాలు అందనున్నాయి. 2022-23 సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖ ప్రకటించాయి. ఇప్పటి వరకూ 1 నుంచి 8వ తరగతి వరకు కూడా ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ పథకం వర్తించేది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కంటెంట్ ఉంటే... క్రియేటర్లు మీరే!
‣ 4 ఏళ్ల ప్రణాళికతో 40 ఏళ్ల కెరియర్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.