• facebook
  • whatsapp
  • telegram

Ben-Gurion University: ఇజ్రాయెల్ బెన్-గురియన్ వ‌ర్సిటీలో ఎమ్మెస్సీ 

ఇండస్ట్రియ‌ల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (ఐఈఎం)

బెన్-గురియన్ యూనివర్సిటీ ఆఫ్ ది నెగెవ్ (బీజీయూ), ఇజ్రాయెల్ ఇండస్ట్రియ‌ల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్  ప్రోగ్రామ్‌లో ఎమ్మెస్సీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఐఈఎం డిపార్ట్‌మెంట్ అధునాతన పరిశోధనతో పాటు అండర్ గ్రాడ్యుయేట్ (బీఎస్సీ), గ్రాడ్యుయేట్ (ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ) విద్యార్థులకు సిస్టమ్ అనాలిసిస్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ మేనేజ్‌మెంట్, రోబోటిక్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్, హెల్త్‌కేర్ సర్వీసులు, రవాణా, కమ్యూనికేషన్, ఎర్గోనామిక్స్ అండ్ న్యాచుర‌ల్ రిసోర్సెస్ లాంటి అంశాల్లో అడ్వాన్స్ డ్‌ రిస‌ర్చ్‌ను అందించాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది.
 ఫీజు: ఐఈఎం రెండు సంవత్సరాల థీసిస్ ట్రాక్ ప్రోగ్రామ్. కోర్సు కోసం ట్యూషన్ ఫీజు సంవత్సరానికి $ 5,000 (US). అర్హులైన విద్యార్థులు ట్యూషన్ ఫీజు, స్కాలర్‌షిప్‌లను పొంద‌వ‌చ్చు.
‣ అర్హ‌త‌: అభ్యర్థి ఇండస్ట్రియ‌ల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ లో బీఎస్సీ డిగ్రీని కలిగి ఉండాలి లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం త‌త్స‌మాన డిగ్రీలో 80/100 జీపీఏ (ఇజ్రాయెల్ గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారం) పొంది ఉండాలి. TOEFL స్కోర్ కనీసం 85/120 లేదా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆంగ్ల నైపుణ్య పరీక్షలో సమానమైన స్కోరు కూడా అవసరం.

మరింత సమాచారం కోసం..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.