• facebook
  • whatsapp
  • telegram

CBSE: సీబీఎస్‌ఈ, టోఫెల్‌పై అధ్యయనం తర్వాతే నిర్ణయం: మంత్రి లోకేశ్‌


ఈనాడు, అమరావతి : సీబీఎస్‌ఈ, టోఫెల్‌ మంచి చెడులపై అధ్యయనం చేసి.. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. ‘గత ప్రభుత్వం సీబీఎస్‌ఈ, టోఫెల్‌ విధానాలను హడావుడిగా తెచ్చి అమలు చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు దానికి సన్నద్ధం కాలేదు’ అని గురువారం తనను కలిసిన విలేకరులతో చెప్పారు. ఈ నేపథ్యంలో వాటి మంచి చెడులపై అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. అర్హులైన అందరికీ తల్లికి వందనం పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నందున అడ్మిషన్లు పెంచడం, నాణ్యమైన విద్య అందించడంపై వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలిస్తామని చెప్పారు.
 

Published Date : 26-07-2024 13:02:30

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం