• facebook
  • whatsapp
  • telegram

EAPCET: 11 కేంద్రాల్లో ఈఏపీసెట్‌

కానూరు, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌-2022 జులై 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ విద్యా సంవత్సరం ఎన్టీఆర్‌ జిల్లాలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ జిల్లా నుంచి మొత్తం 23768 మంది విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయించారు. కృష్ణా జిల్లాలో 2 కేంద్రాలు కేటాయించగా.. వీటిలో  2699 మంది పరీక్ష రాయనున్నారు. ఇంజినీరింగ్‌ విభాగం విద్యార్థులకు 8వ తేదీ వరకు, మెడికల్‌ విభాగం విద్యార్థులకు 11, 12 తేదీల్లో పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు, వాచ్‌లను అనుమతించేదిలేదని అధికారులు తెలిపారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.