• facebook
  • whatsapp
  • telegram

UPSC Exam Calendar: వచ్చే ఏడాది మే 25న సివిల్స్‌ ప్రిలిమ్స్‌

* యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్యాలెండర్ 2025 విడుదల

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వచ్చే ఏడాది నిర్వహించే పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. 2025లో చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్‌ను విడుదల చేసింది. దీంట్లో 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్‌ వరకు నిర్వహించే పరీక్షల తేదీలను పేర్కొంది. దీనిప్రకారం.. 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించి మే 25న పరీక్ష నిర్వహించనుంది. అలాగే, ఆగస్టు 22 నుంచి ఐదు రోజుల పాటు యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. 

వీటితో పాటు సీబీఐ (డీఎస్పీ), ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ), సీఐఎస్‌ఎఫ్‌, ఎన్‌డీఏ, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ, మెయిన్‌, సీడీఎస్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ తదితర ఉద్యోగ నియామక పరీక్షల షెడ్యూల్‌ను యూపీఎస్సీ ఈ చార్ట్‌లో పేర్కొంది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను ఈ క్యాలెండర్‌లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చని తెలిపింది. యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్‌ను ఈ కింది డాక్యుమెంట్‌లో చూడొచ్చు.
 

యూపీఎస్సీ 2025లో నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌..

నోటిఫికేషన్ విడుదల తేదీ    

దరఖాస్తు చివరి తేదీ

పరీక్ష తేదీ
సివిల్ సర్వీసెస్(ప్రిలిమ్స్), ఐఎఫ్‌ఎస్‌(ప్రిలిమ్స్‌) ఎగ్జామ్ 22.01.2025 11.02.2025 25.05.2025
ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ, సీడీఎస్‌ ఎగ్జామ్‌(1) 11.12.2024 31.12.2024 13.04.2025
ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌(ప్రిలిమ్స్‌) ఎగ్జామ్‌ 18.09.2024 08.10.2024 09.02.2025
కంబైన్డ్‌ జియో-సైంటిస్ట్‌(ప్రిలిమ్స్‌) 04.09.2024 24.09.2024 09.02.2025
సీఐఎస్‌ఎఫ్‌ ఏసీ(ఈఎక్స్‌ఈ) ఎల్‌డీసీఈ 04.12.2024 24.12.2024 09.03.2025
ఐఈఎస్‌/ ఐఎస్‌ఎస్‌ ఎగ్జామ్‌ 12.02.2025 04.03.2025 20.06.2025
కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ 19.02.2025 11.03.2025 20.07.2025
సీఏపీఎఫ్‌(ఏసీ) ఎగ్జామ్‌ 05.03.2025 25.03.2025 03.08.2025
ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ, సీడీఎస్‌ ఎగ్జామ్‌(2) 28.05.2025 17.06.2025 14.09.2025
ఎస్‌వో/ స్టెనో(జీడీ-బి/జీడీ-1) ఎల్‌డీసీఈ 17.09.2025 07.10.2025 13.12.2025



  యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్యాలెండర్ 2025 కోసం క్లిక్‌ చేయండి   



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.