• facebook
  • whatsapp
  • telegram

జులైలో సీబీఎస్ఈ ప‌ది ఫ‌లితాలు!

 

ర‌ద్దు చేసిన సీబీఎస్ఈ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జులైలో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. గ‌తంలో జూన్ మూడో వారంలోనే ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు సీబీఎస్ఈ పేర్కొనగా.. అన్ని రాష్ట్రాలు విద్యార్థుల ఇంట‌ర్న‌ల్ అసెస్‌టెంట్ మార్కుల‌ను పంపించాల్సి ఉంది. ఈ ప్ర‌క్రియ‌లో ఏర్ప‌డిన జాప్యం కార‌ణంగా ఫ‌లితాల వెల్ల‌డి కాస్త ఆల‌స్యం కానున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సీబీఎస్ఈ అసెస్‌మెంట్‌ మార్కుల స‌మ‌ర్ప‌ణ తుది గ‌డువును కూడా జూన్ 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో జూన్‌లో ప‌రీక్ష‌ల ఫ‌లితాలు రావ‌డం దాదాపు అసాధ్య‌మే. ఈమేర‌కు జులైలోనే ఫ‌లితాలు వెల్ల‌డికానున్న‌ట్లు స‌మాచారం. దేశంలో క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సీబీఎస్ఈ ఏప్రిల్ 14న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈమేర‌కు విద్యార్థుల‌ ఆబ్జెక్టివ్ క్రైటేరియా ఆధారంగా ఫ‌లితాలు వెల్ల‌డించ‌నున్నారు. 

 

Posted Date : 18-05-2021