• facebook
  • whatsapp
  • telegram

8 నుంచి ఎస్‌యూ డిగ్రీ పరీక్షలు


 

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జులై 8 నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్‌ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌) పరీక్షలను నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి.భరత్‌ తెలిపారు. ఈ మేరకు జూన్ 30న‌ పరీక్షల కాల పట్టికను విడుదల చేశారు. 5వ సెమిస్టర్‌ విద్యార్థులకు ఉదయం 10గంటల నుంచి 12వరకు, 3వ సెమిస్టర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షల కాల పట్టిక కోసం వర్సిటీ వెబ్‌సైటు https://www.satavahana.ac.in/ ను సందర్శించాలన్నారు.

Posted Date : 01-07-2021