• facebook
  • whatsapp
  • telegram

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ అడ్మిట్ కార్డులు

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరులో బ్ర‌హ్మానంద‌రెడ్డి స్టేడియ‌లో నిర్వ‌హించ‌నున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు త‌మ అడ్మిట్ కార్డుల‌ను ఆర్మీ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. జులై 15 నుంచి 30 వ‌ర‌కు ర్యాలీ జ‌రుగుతుంది. రాష్ట్రంలోని గుంటూరు, ప్ర‌కాశం, క‌ర్నూలు, అనంత‌ర‌పురం, క‌డ‌ప‌, నెల్లూరు, చిత్తూరు జిల్లాల‌కు చెందిన అభ్య‌ర్థులు ఇందులో పోటీ ప‌డ‌తారు. ర్యాలీ ద్వారా సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ/ టెక్నిక‌ల్/ న‌ర్సింగ్ అసిస్టెంట్‌/ న‌ర్సింగ్ అసిస్టెంట్ వెట‌ర్న‌రీ/ క్ల‌ర్క్‌/ కీప‌ర్ టెక్నిక‌ల్‌/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఫ‌జిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, ఫిజిక‌ల్ మేజ‌ర్‌మెంట్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌, కామ‌న్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్ ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు. 

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/


 

Posted Date : 01-07-2021