* 147 మంది అభ్యర్థుల ఎంపిక
ఈనాడు ప్రతిభ డెస్క్: ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(IFS)-2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. గతేడాది నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రధాన పరీక్షలు(Mains); ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు ఇంటర్వ్యూలు (Interview) నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 147 మంది అభ్యర్థుల ఎంపికయ్యారు. ప్రిలిమినరీ (Prelims)ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఐఎఫ్ఎస్ 2023 తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.