• facebook
  • whatsapp
  • telegram

ఎండీఎస్‌ కౌన్సెలింగ్‌పై సమాధానం ఇవ్వండి

* కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు 

 

 

దిల్లీ: ఎండీఎస్‌ కోర్సులో ప్రవేశానికి త్వరగా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు జులై 2న కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. నీట్‌-ఎండీఎస్‌ ప్రవేశ పరీక్షలను గత డిసెంబరు 16న నిర్వహించినప్పటికీ, ఇంతవరకు కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించలేదంటూ తొమ్మిది మంది బీడీఎస్‌ వైద్యులు ఈ దావా వేశారు. దీనిని న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. తేదీలు ప్రకటించడంలో మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) నిరవధికంగా జాప్యం చేస్తోందని, దీనిపై తాజా సమాచారం ఇవ్వడం లేదని పిటిషన్‌దారులు ఆరోపించారు. ఎంసీసీ, డెంటల్‌ కౌన్సిల్‌లకు కూడా నోటీసులు పంపించి తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది. 
 

Posted Date : 02-07-2021