• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ(మెయిన్) నాలుగో విడ‌త ప‌రీక్ష తేదీలు మార్పు

జేఈఈ(మెయిన్‌) నాలుగో విడ‌త ప‌రీక్ష తేదీల్లో మార్పులు చేసిన‌ట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తెలిపారు. ఈమేర‌కు ఆగ‌స్టు 26, 27, 31, సెప్టెంబ‌ర్ 1, 2 తేదీల్లో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జేఈఈ మెయిన్‌ నాలుగో సెషన్‌ దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఇటీవ‌ల ఎన్‌టీఏ ప్ర‌క‌టించిన షెడ్యూలు ప్ర‌కారం నాలుగో విడ‌త జులై 27 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు జ‌ర‌గాల్సి ఉంది. మూడో విడ‌త అడ్మిట్ కార్డులు విడుద‌ల చేసిన ఎన్‌టీఏ.. అందులో ప‌రీక్ష తేదీల్లో మార్పులు చేసింది. మూడో విడ‌త జులై 20 నుంచి 25 వ‌ర‌కు జర‌గాల్సి ఉండ‌గా.. జులై 27 వ‌ర‌కు పొడిగించింది. దీంతో మూడు, నాలుగు ప‌రీక్ష‌ల తేదీలు క‌లిసే అవ‌కాశం ఏర్ప‌డింది. అయితే నాలుగో విడ‌త ప‌రీక్ష తేదీల్లో మార్పులు అనివార్య‌మైంది. అలాగే విద్యార్థుల డిమాండ్ దృష్ట్యా ఈ ప‌రీక్ష‌ను నెల‌రోజుల త‌ర్వాత నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు.  మెయిన్‌ చివరి విడత పరీక్షల తేదీలు మారిన నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ కూడా మారనుంది. ఆ పరీక్ష సెప్టెంబరు 26వ తేదీన జరిగే అవకాశం ఉందని ఐఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

 

 

Posted Date : 15-07-2021