• facebook
  • whatsapp
  • telegram

ప‌ద్మావ‌తి మ‌హిళా వ‌ర్సిటీలో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

 

మహిళా వర్సిటీ (తిరుపతి): శ్రీ పద్మావతీ  మహిళా వర్సిటీలో పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు జులై 20న‌ ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎమ్మెస్సీ అప్లెడ్‌ మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ, బయో టెక్నాలజీ, క్లినికల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్, ఫుడ్‌సైన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్, కమ్యూనిటీ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫ్యామిలీ స్టడీస్‌ విద్యార్థినులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఫిజిక్స్, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సెరికల్చర్, స్టాటిస్టిక్స్, ఐఎఫ్‌టీ, బీ.ఒకేషనల్‌ ఎన్‌హెచ్‌సీఎస్, ఫ్యాషన్‌ టెక్నాలజీ, బి.ఫార్మసీ విద్యార్థినులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5వరకు పరీక్షలు జరిగాయి. వీసీ ఆచార్య జమున, రెక్టార్‌ ఆచార్య శారద, డీన్‌ భారతి, పరీక్షలను పర్యవేక్షించారు. 

Posted Date : 21-07-2021