• facebook
  • whatsapp
  • telegram

ఏపీ లాసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

 

మహిళా వర్సిటీ(తిరుపతి), న్యాయవిద్యలో (2021-22 విద్యాసంవత్సరం) ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆ సెట్‌ కన్వీనర్, శ్రీపద్మావతీ మహిళా వర్సిటీ న్యాయ విభాగం ఆచార్యులు చంద్రకళ జులై 21న విడుదల చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున ఈ ఏడాది ఏపీ లాసెట్‌ను శ్రీపద్మావతీ మహిళా వర్సిటీ నిర్వహిస్తోందని కన్వీనర్‌ తెలిపారు. మూడేళ్లు, ఐదేళ్ల రెగ్యులర్‌ ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 22 నుంచి ఆగస్టు 20 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబరు 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 45 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు, 45 శాతం మార్కులతో ఇంటర్, తత్సమాన అర్హత కోర్సు పూర్తి చేసిన వారు ఐదేళ్ల కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు https://sche.ap.gov.in/ lawcet వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. 

Posted Date : 21-07-2021