• facebook
  • whatsapp
  • telegram

Online portal: సామాజిక భద్రత కోర్సులకు ఆన్‌లైన్‌ పోర్టల్‌

‣ ‘తపస్‌’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌

దిల్లీ: సామాజిక భద్రతకు సంబంధించిన కోర్సుల్లో శిక్షణ అందించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ ఆన్‌లైన్‌ పోర్టల్‌ తపస్‌(టిఏపీఏఎస్‌)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సబ్జెక్టు నిపుణుల ఉపన్యాసాలు, అధ్యయన పత్రాలు తరగతి బోధన లోటును తీర్చేలా, విషయ పరిజ్ఞానాన్ని వృద్ధిచేసేలా ఉంటాయని ఆగ‌స్టు 14న తపస్‌ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ తెలిపారు. ఔషధాల దుర్వినియోగ నివారణ, వృద్ధుల సంరక్షణ, చిత్తవైకల్యం-సంరక్షణ- నిర్వహణ, ట్రాన్స్‌జెండర్‌ సమస్యలు, సామాజిక భద్రత అంశాల్లో ఈ కోర్సులు ఉంటాయని, ప్రవేశ రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు. జాతీయ సామాజిక భద్రత సంస్థ(ఎన్‌ఐఎస్‌డీ) తపస్‌ ఆవిర్భావానికి చొరవ తీసుకుందని సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖ తెలిపింది.

Posted Date : 15-08-2021